»   » సూర్య ‘సింగం-3’ పరిస్థితి ఏంటి? ఎప్పుడొస్తోంది?

సూర్య ‘సింగం-3’ పరిస్థితి ఏంటి? ఎప్పుడొస్తోంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్‌ను దక్కించుకున్న ప్రముఖ కథానాయకుడు సూర్య నటిస్తున్న తాజా చిత్రం సింగం-3. గతంలో వచ్చిన సింగం, సింగం-2 చిత్రాలు ఘనవిజయాలు సాధించిన సంగతి తెలిసిందే. సింగం సిరీస్‌లో భాగంగా హరి దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న సీక్వెల్ సింగం-3పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

తమిళ్ లో ప్రముఖ నిర్మాత స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా అధినేత మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు.

Singam 3 movie shooting update

ఈ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలను తెలియజేస్తూ ఈ చిత్రానికి తమిళం తో పాటు తెలుగు లో వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తప్పకుండా ఈ చిత్రం అందరి అంచనాలను అందుకుంటుందని నమ్మకం వుంది. సూర్య సరసన అనుష్క, శృతి హాసన్ నాయికలుగా నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో ప్రారంభమైన షెడ్యూల్ ఈ నెల 20 తో పూర్తయ్యింది. దీంతో టాకీ పార్ట్ పూర్తయ్యిందని తెలిపారు.

బ్యాలన్స్ గా వున్న ఒక పాటను సూర్య, అనుష్క ల పై విదేశాల్లో త్వరలో చిత్రీకరించడంతో షూటింగ్ పార్ట్ పూర్తి అవుతుంది. దీపావళి కి టీజర్ ను, నవంబర్ లో ఆడియో ని విడుదల చేసి డిసెంబర్ 16 న తెలుగు, తమిళ్ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. తెలుగు నేటివిటికి దగ్గరగా వుండే ఈ చిత్ర నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలుంటాయన్నారు.

ఇప్పటికే తెలుగులో ఈ చిత్రానికి సంబంధించి అన్ని ఏరియాల్లో ఫ్యాన్సీ రేట్లతో బిజినెస్ పూర్తయిందన్నారు. అనుష్క శెట్టి, శృతీహాసన్, రాధిక శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:హేరీస్‌జైరాజ్.

English summary
Suriyas upcoming actioner Singam 3 has its release date locked, will hit the screens on December 16 as a Christmas treat to fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu