»   » పార్టీలో మునిగి తేలిన సూర్య, అనుష్క (వీడియో)

పార్టీలో మునిగి తేలిన సూర్య, అనుష్క (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూర్య హీరోగా హరి దర్శకత్వంలో వచ్చిన 'సింగం', 'సింగం-2' భారీ విజయం సాధించాయి. తాజాగా వీరి కాంబినేషన్లో తాజాగా మరో సీక్వెల్ తెరకెక్కుతోంది. దీనికి 'సింగం 3' అని కాకుండా 'ఎస్ 3' అని టైటిల్ పెట్టారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇటీవలే రొమేనియాలో షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

Singam 3‬ Romania schedule wrap up party!

రొమేనియా షెడ్యూల్ పూర్తయిన అనంతరం యూనిట్ సభ్యులు కేక్ కట్ చేసి పార్టీ చేసుకున్నారు. తాజాగా అందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో విడుదలైంది. సూర్యతో కలిసి అనుష్క కూడా ఈ పార్టీలో పాల్గొంది. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ లా వ్యాపించింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి.

#Suriya #AnushkaShetty @ #Singam3 Romania schedule wrap up party!

Posted by Suriya Fans on Friday, March 18, 2016

సూర్య సొంత బేనర్‌ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రుతిహాసన్‌, అనుష్కశెట్టి ఇందులో ప్రధాన పాత్రలు నటించనున్నారు. ప్రస్తుతం సూర్య నటించి తమిళ్‌ థ్రిల్లర్‌ '24' త్వరలో విడుదల కానుంది. తెలుగులో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించగా సమంత, నిత్యామేనన్‌ ప్రధాన పాత్రలు పోషించారు.

సూర్యకు ఈ మధ్య వరుసగా ఫ్లాపులు పలకరించాయి... 'సికిందర్, రాక్షసుడు' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరపరాజయం పాలు కావడంతో సూర్య ఇప్పుడు సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. 24 చిత్రంపై సూర్య భారీ అంచనాలు పెట్టుకున్నాడు. 'సింగం' చిత్రాలతో విజయాలను అందించాడు దర్శకుడు హరి... అదే తీరున సాగుతున్న సూర్యకు 'సింగం-3' కూడా విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నారు.

English summary
‎Suriya and‬ ‎Anushka Shetty‬ at ‎Singam3‬ Romania schedule wrap up party.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu