»   » సూర్య ‘సింగం-3’ అఫీషియల్ ట్రైలర్

సూర్య ‘సింగం-3’ అఫీషియల్ ట్రైలర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ స్టార్ సూర్య త్వరలో సింగం-3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తమిళం, తెలుగు భాషల్లో సూర్య హీరోగా తెరకెక్కిన సింగం, సింగం 2 భారీ విజయం సాధించడంతో ఈ సిరీస్ లో మూడో చిత్రంగా 'సింగం-3'ని తెరకెక్కించారు.

గత రెండు సింగం సిరీస్ లకు దర్శకత్వం వహించిన హరి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బేబి త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. జనవరి 26న సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది.సినిమా రిలీజ్ నేపథ్యంలో మ‌ల్కాపురం శివ‌కుమార్ మాట్లాడుతూ... సూర్య హీరోగా హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సింగం, సింగం2 సినిమాలు ఎంత పెద్ద స‌క్సెస్‌ను సాధించాయో తెలిసిందే. ఇప్పుడు ఈ హిట్ కాంబోలో వ‌స్తున్న సీక్వెల్ సింగం 3. హ‌రిగారు సినిమాను ఎంత స్పీడ్‌గా తెర‌కెక్కిస్తారో తెలిసిందే. ఇంత‌కు ముందు వ‌చ్చిన సింగం సీక్వెల్‌కు ధీటుగా భారీ బ‌డ్జెట్‌తో, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో సినిమా ఉంటుంది అన్నారు.


ఈ సినిమా టీజ‌ర్‌ను ప‌ది మిలియ‌న్ మంది వ్యూవ‌ర్స్ వీక్షించ‌డంతో సినిమాపై ఎంత‌టి అంచ‌నాలున్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ మూడో పార్ట్‌లో సూర్య ప‌వ‌ర్‌ఫుల్ న‌ట‌న సినిమాకు పెద్ద ఎసెట్ అయితే అనుష్క‌, శృతిహాస‌న్ గ్లామ‌ర్ ఆడియెన్స్‌ను అల‌రిస్తాయి. సింగం 3 సినిమాను తెలుగు, త‌మిళ భాష‌ల్లో జ‌న‌వ‌రి 26న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం అని శివ కుమార్ తెలిపారు.

English summary
Singam 3 Telugu Theatrical Trailer released. Singam 3 is an upcoming 2017 Indian Tamil-language action-masala film written and directed by Hari. A sequel to Singam II and the third film in the Singam franchise, it stars Suriya, Shruti Haasan and Anushka Shetty.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu