»   » సూరితో నాకు కేవలం ఆ రిలేషనే...ఖలేజా నిర్మాత

సూరితో నాకు కేవలం ఆ రిలేషనే...ఖలేజా నిర్మాత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హత్యకు గురైన మద్దెలచెరువు సూరికి సిని పరిశ్రమతో సంభందాలన్నాయని, చాలా చిత్రాల్లో పెట్టుబడి పెట్టాడని వినపడుతోంది. ఖలేజా, కొమురం పులి నిర్మాత శింగనమల రమేష్ ప్లాటులో నివాసముంటున్న సూరి ఆ సినిమాలకు కూడా కొంత డబ్బు పెట్టాడని చెప్తున్నారు. అయితే శింగనమల రమేష్ వీటిని ఖండిస్తున్నారు. తాను చెన్నైలో ఉండటం వల్ల తన ప్లాటు ఖాలీగా ఉంటోందని, తన స్నేహితులు పరిచయం చేసిన సూరికి దానిని ఇచ్చానని అంతవరకే అతనితో రిలేషన్ అని చెప్తున్నాడు. అలాగే..కొన్ని విషయాల్లో ఆయన సాయం చేసాడని మాత్రం చెప్పారు. ఇక మరో నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ...సూరిని చంపాడని చెప్పబడుతున్న భానుని పర్శనల్ గా తెలుసని, అతని చాలా మంచి వ్యక్తి అని, అతను సూరి చంపాడని తాను నమ్మటం లేదని అన్నారు. ఇక రక్త చరిత్ర జరుగుతున్నప్పుడు కూడా సూరి ఆ చిత్రానికి ఫైనాన్సియల్ సపోర్టు ఇచ్చాడని వినపడింది. ఇక ఖలేజా, పులి చిత్రాలకే కాక, రక్త చరిత్ర తెలుగు వెర్షన్ ని కూడా సి.కళ్యాణే తీసుకుని విడుదల చేసిన సంగతి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu