For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాలకృష్ణతో చిత్రం ఖరారు చేసిన సింగీతం ..

By Srikanya
|

హైదరాబాద్ :బాలకృష్ణ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ 'ఆదిత్య 369' చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హాలీవుడ్ స్థాయి కథాంశంతో అలనాడే తెలుగు పరిక్షిశమలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. తాజా సమాచారం ప్రకారం తిరిగి బాలకృష్ణ-సింగీతం శ్రీనివాసరావు కలయికలోనే ఈ చిత్ర సీక్వెల్‌కు ప్రయత్నాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు ఖరారు చేసారు.

ఈ విషయమై సింగీతం మాట్లాడుతూ..."బాలకృష్ణతో ఆదిత్య 369 కొనసాగింపు చిత్రం కి కథని సిద్ధం చేస్తున్నాం. సినిమాకి ఆదిత్య999 అని పేరు కూడా అనుకుంటున్నాం. అయితే దీనికి కాస్త సమయం పడుతుంది. పాత సినిమాకి ఏం మాత్రం సంబంధం లేని సినిమాగా రూపొందిస్తాం" అంటూ చెప్పుకొచ్చారు . ప్రముఖ నిర్మాత కొండా కృష్ణంరాజు ఈ చిత్రానికి సమర్పకుడుగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం.త్వరలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనున్నట్లు సినీ వర్గాల సమాచారం.

ఈ సీక్వెల్‌కు 'ఆదిత్య 999' అనే పేరు పరిశీలిస్తున్నారు. కేవలం అంకెలు మాత్రమే మార్చడానికి ప్రత్యేకమైన కారణం ఉందని, బాలయ్యకు కలిసొస్తుందనే నమ్మకంతోనే సినిమా హిట్ కొట్టాలని 369ని, 999గా మార్చారని అంటున్నారు. మరి వాళ్ల నమ్మకం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. బాలయ్య ఈ సీక్వెల్‌పై చాలా ఆసక్తి చూపుతున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్లోర్ మీదకు రానుంది.

1991లో విడుదలైన 'ఆదిత్య 369' విమర్శకులు ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా భారీ విజయాన్ని సాధించి బాలకృష్ణ కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచిపోయింది. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయగా బాలకృష్ణ అద్భుతాభినయం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఇళయరాజా స్వరకల్పనలోని పాటలన్నీ బహూళ ప్రజాదరణ పొందాయి.

ఇక ప్రస్తుతం బాలకృష్ణ...బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇటీవలే బాలకృష్ణ, జగపతిబాబు సవాళ్లతో కీలక సన్నివేశాలు చిత్రించారు. దీని దెబ్బకి జగపతిబాబు, అజయ్‌ కలిసి బాలకృష్ణని ఏం చేద్దామా అంటూ సెంట్రల్‌ జైల్‌ సెట్లో మంతనాలు జరుపుతున్నారు. ఈ సీన్స్ సినిమాని మలపు తిప్పుతాయని తెలుస్తోంది. జగపతిబాబుకి బాలకృష్ణ ఎలా రిటార్ట్ ఇస్తాడనేది కథలో కీలకాంశంగా ఉంటుందని అంటున్నారు. సోనాల్‌చౌహాన్‌ ఓహీరోయిన్. మరో హీరోయిన్ ఇంకా ఎంపిక కావాల్సి ఉంది. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, వారాహి చలన చిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

English summary
Nandamuri Balakrishna’s path breaking 1991 film ‘Aditya 369′ will be having a sequel very soon. The name of the film has been finalized and sources say that the movie’s name is ‘Aditya 999′. Anushka might play the female lead opposite Balakrishna. Singeetham Srinivasa Rao is the director of the movie and Vinod is the producer. Konda Krishnam Raju will be acting as the presenter of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more