»   » వివాహం: గిఫ్ట్స్ వద్దు డబ్బు తేవాలంటున్న సింగర్ చిన్మయి!

వివాహం: గిఫ్ట్స్ వద్దు డబ్బు తేవాలంటున్న సింగర్ చిన్మయి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి వివాహం నటుడు రాహుల్ రవీంద్రన్‌తో జరుగబోతున్న సంగతి తెలిసిందే. మే 6వ తేదీన వీరి వివాహం చెన్నైలో ఘనంగా జరుగబోతోంది. తన వివాహం సందర్భంగా చిన్మయి ఓ సేవా కార్యక్రమానికి ప్రచారం కల్పించాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా ఆమె....తన వివాహానికి వచ్చే అతిథిలు తన కోసం బహుమతులు తేవొద్దని.....గిఫ్టుల కోసం వెచ్చించే డబ్బులను '17000ఎఫ్‌టి ఫౌండేషన్' కోసం విరాళంగా ఇవ్వాలని కోరుతోంది. లడఖ్ ప్రాంతానికి చెందిన ఈ స్వచ్ఛంద సంస్థ ఆ ప్రాంతంలోని పేద పిల్లల విద్యకోసం సహాయ పడుతోంది.

Singer Chinmayi charity plan

చిన్నయి తల్లి పద్మాసిని మాట్లాడుతూ....'ఈ రోజుల్లో ఓ ఫ్లవర్ బొకే కొనాలంటే రూ. 500 ఖర్చవుతున్నాయి. వాటి కోసం వెచ్చించే డబ్బులను సేవా కార్యక్రమాల కోసం ఉపయోగిస్తే బాగుటుంది. ఎంతో మందికి మంచి జరుగతుంది. అందుకే చిన్మయి వివాహం సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని ప్రొత్సహించాలని నిర్ణయించా' అన్నారు.

చిన్మయి, రాహుల్ రవీంద్రన్ (అందాల రాక్షసి ఫేం) వివాహ విషయానికొస్తే....కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. వీరి వివాహానికి సినీ పరిశ్రమ నుంచీ భారీగానే హాజరవుతారని తెలుస్తోంది. అందాల రాక్షసి చిత్రం ద్వారా తెలుగు హీరోగా పరిచయం అయిన రాహుల్, ఆ తర్వాత పలు చిన్న బడ్జెట్ చిత్రాల్లో నటింస్తున్నాడు. ప్రస్తుతం పెళ్లి పుస్తకం, వనక్కం చెన్నై, నేనేం చిన్న పిల్లనా చిత్రాల్లో నటిస్తున్నాడు. తెలుగులో ప్రవేశించడానికి ముందు రాహుల్ మూడు తమిళ చిత్రాల్లో నటించాడు.

English summary
South Indian singer cum dubbing artist Chinmayi Sripada, who is gearing up for her marriage with actor Rahul Ravindran on 6th of May is promoting charity.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu