»   » చిన్మయి పెళ్లి గురించి ఆమె తల్లి...

చిన్మయి పెళ్లి గురించి ఆమె తల్లి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌, నేపథ్యగాయని చిన్మయి పెళ్లి కూతుర వ్వబోతున్న సంగతి తెలిసిందే. తమిళనటుడు 'అందాలరాక్షసి' ఫేం రాహుల్‌ని ఈ అమ్మడు వివాహమాడబోతోంది. ఇప్పటికే వీరిద్దరూ ప్రేమాయణం సాగిస్తున్నారని చెన్నయ్‌వర్గాలు చెబుతు న్నాయి. ఇరు కుటుంబాలు తాంబూళాలు పుచ్చుకోవడానికి కూడా రెడీ అవుతున్నాయి. 2014 ఫిబ్రవరిలో ఈ ప్రేమజంట వివాహం జరుగుతుందని తెలుస్తోంది. ఈ విషయమై చిన్మయి తల్లి పద్మాసిని మీడియా తో మాట్లాడింది.

పద్మాసిని మాట్లాడుతూ....''చిన్మయికి తగ్గ వరుడు రాహుల్‌ రవీంద్రన్‌. వారి కుటుంబంలో అందరికీ చిన్మయి అంటే ఇష్టం. వచ్చే నెల నిశ్చితార్థం నిర్వహించనున్నాం. వచ్చే యేడాది ఫిబ్రవరిలో వివాహం ఉంటుంది''అని చెప్పారు.

Chinmayi

చిన్మయి తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఫేమస్‌ అన్న సంగతి తెలిసిందే. అందాల సమంత కెరీర్‌ నేడు ఓ రేంజులో ఉందంటే ఈ అమ్మడి స్వీట్‌ వాయిస్‌ ఓ కారణం. 'ఏమాయ చేశావె' జెస్సీ అంటే కుర్రాళ్లు పిచ్చెక్కిపోయారంటే చిన్మయి స్వరవిన్యాసమది. ఆ తర్వాత సమంత ప్రతి సినిమాకి వాయిస్‌ ఈ భామే ఇచ్చింది. ఇటీవలే షారూక్‌ఖాన్‌ 'చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌'లో ఓ హిట్‌సాంగ్‌ పాడి ప్రశంసలందుకుంది. కెరీర్‌లో సక్సెసై నట్టే...వ్యక్తిగత జీవితంలోనూ విజయాన్ని ఆస్వాధిం చబోతోంది చిన్మయి.

ఏ దేవి వరము నీవో..' అంటూ తెలుగు ప్రేక్షకులకు తన తీయటి స్వరాన్ని వినిపించిన గాయని చిన్మయి. 'అమృత'తో పాటు, 'పిల్ల జమిందార్‌', 'ఎందుకంటే ప్రేమంట' తదితర తెలుగు చిత్రాల్లో ఆమె పాటలు పాడింది. 'ఏ మాయ చేసావె' చిత్రంలో సమంతకి డబ్బింగ్‌ చెప్పి తన గాత్రాన్ని తెలుగువారికి మరింత చేరువచేసింది. ఆమెకి పెళ్లి కుదిరింది. 'అందాల రాక్షసి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన రాహుల్‌ రవీంద్రన్‌. తమిళంలో 'విన్‌మీన్‌గల్‌', 'మాస్కోవిన్‌ కావేరి' చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకొన్నాడు. వీరిద్దరూ వివాహబంధంతో ఒకటి కానున్నారు.

English summary
Popular Singer and Dubbing Artist ‘Chinmayi’ to get married with ‘Andala Rakshasi’ fame Rahul Ravindran. The news came into picture from Chinmayi’s Mother T.Padmahasini.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu