తమిళ పనిమనిషిపై ప్రముఖ రచయిత రేప్.. విరుచుకుపడిన చిన్మయి

దక్షిణాది సినీ పరిశ్రమలో మీటూ ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన గాయని చిన్మయి శ్రీపాద అడపదడపా సినీ పరిశ్రమలో లైంగిక దాడులపై స్పందిస్తున్నారు. సినిమాల్లో మహిళలను కించపరిచే విధంగా ఉండే అంశాలను కూడా తూర్పార పడుతున్నారు. తాజాగా తమిళ పని మనిషిపై ఓ ప్రముఖ రచయిత అత్యాచారం చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ సంఘటన గురించి వివరాల్లోకి వెళితే..

చీలీ రచయిత పాబ్లో నెరుడా తన ఆత్మకథలో

చీలీ రచయిత పాబ్లో నెరుడా తన ఆత్మకథలో

చీలి దేశపు ప్రముఖ రచయిత పాబ్లో నెరుడా తన ఆత్మకథను రాసుకొన్నారు. మెమైర్స్ ఆఫ్ పాబ్లో నెరుడా అనే పుస్తకంలో తాను శ్రీలంకలో పర్యటించినప్పుడు ఓ తమిళ పని మనిషిపై అత్యాచారం జరిపాను. ఆ తర్వాత ఆ సంఘటనపై పశ్చాత్తాపం చెందాను అని నెరుడా పేర్కొన్నారు.

రచయిత ప్రవర్తన సమంజసమేనా?

రచయిత ప్రవర్తన సమంజసమేనా?

తాజాగా వెలుగులోకి వచ్చిన ప్లాబో నెరుడా రేప్ అంశంపై చిన్మయి తీవ్రస్థాయిలో స్పందించింది. ఇటీవల ప్రముఖ పాబ్లో నేరుడా తమిళ పని మనిషిపై రేప్ చేశారనే విషయం నా దృష్టికి వచ్చింది. శ్రీలంకలో ఓ దౌత్యవేత్త హోదాలో వెళ్లి ఈ చర్యకు పాల్పడ్డారు. ఇప్పుడు తన చర్యలను పుస్తకంలో పేర్కొంటూ పశ్చాత్తాపం చెందుతుండటం సమంజసమేనా అని ప్రశ్నించారు.

ఇలాంటి మహానుభావులెంతమందో..

నోబెల్ పురస్కారం పొందిన రచయిత మహిళను రేప్ చేశాననని గొప్పగా చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తిని ఇంకా మహానుభావుడిగా చూడడటం మన ఖర్మ. ఇలాంటి మహానుభావులు ఎంతమంది మహిళలపై దాడులకు పాల్పడ్డారో అనే విషయం భయాన్ని కలిగిస్తున్నది అని చిన్మయి శ్రీపాద ఆందోళన వ్యక్తం చేశారు.

Recommended Video

Manmadhudu 2 Team Independence Day Special Interview || AKkineni Nagarjuna || Rakul Preet Singh
తమిళ పరిశ్రమలో మీటూ ఉద్యమం

తమిళ పరిశ్రమలో మీటూ ఉద్యమం

తమిళ పరిశ్రమలో మహిళా కళాకారులపై ప్రముఖుల లైంగిక వేధింపులపై 2018లో చిన్మయి తీవ్రస్థాయిలో ఆందోళన మొదలుపెట్టింది. మీటూ ఉద్యమంలో భాగంగా రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించారని ఆరోపణలు చేసింది. అలాగే తమిళ పరిశ్రమలో వైరముత్తుపై వేటు వేసే విధంగా ఉద్యమాన్ని నడిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X