»   » అందరికన్నా ముందు ఆమే: ఆ సింగర్ వెనుక 10 కోట్ల మంది ఉన్నారు

అందరికన్నా ముందు ఆమే: ఆ సింగర్ వెనుక 10 కోట్ల మంది ఉన్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ సింగర్ కేటి పెర్రీ ఒక కొత్త చరిత్ర ను సృష్టించింది. ఇటీవల కేటి పెర్రీ ట్విట్టర్ హ్యాక్ అయినా సంగతి మనకి తెలిసిందే. టాప్ హీరోస్ , హీరోయిన్స్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఈమెకు ఉండడంతో దానిని ఓర్చుకోలేని ఎవరో ఇతర సెలబ్రిటీల ఫ్యాన్స్ ఈమె ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసి కొన్ని అసభ్య సందేశాలను పోస్ట్ చేసిన సంగతి మనకి తెలిసిందే. అయితే ఈ ఎఫెక్ట్ కేటి ట్విట్టర్ ఖాతా మీద అంతగా ఎఫెక్ట్ చూయించలేదేమో ఆమె ట్విట్టర్ ఫాలోయర్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.

పది కోట్ల ఫాలోవర్లు

పది కోట్ల ఫాలోవర్లు

శుక్రవారం ఆమె ట్విట్టర్‌ ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్లకు చేరుకుంది. అంటే పది కోట్ల మంది. దీంతో పది కోట్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్న ట్విట్టర్‌ తొలి యూజర్‌గా ఆమె అరుదైన ఘనత సాధించింది. ఈ అరుదైన మార్క్‌ను అభిమానుల వల్లే చేరుకోగలిగానని వారికి ధన్యవాదాలు తెలిపింది ఈ గాయని.

అసభ్య సందేశాలు

అసభ్య సందేశాలు

ఆమె ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నారని ఇతర సెలబ్రిటీల ఫ్యాన్స్‌ కొందరు ఇటీవల కేటి ట్విట్టర్‌ ఖాతాను హ్యాక్‌ చేసి.. అసభ్య సందేశాలు పోస్ట్‌ చేశారు కూడా. ప్రస్తుతం కేటి తన కొత్త ఆల్బమ్‌ 'విట్‌నెస్‌' తో ఈవెంట్లలో బిజీగా ఉంది. 2015లో ఆమె కో డ్యాన్సర్‌ షార్క్‌ డ్రెస్‌ ధరించడంతో అప్పటో హాట్‌ టాపిక్‌గా నిలిచింది.

కాళికాదేవీ

కాళికాదేవీ

గతం లో ఒకసారి "నా మూడ్‌ కాళికాదేవీలా ఉంది" అంటూ సోషల్‌ మీడియాలో ఓ ఫొటో పెట్టి వివాదాల‌కు తావిచ్చింది . ఈ ఫొటోను చూసిన భారత నెటిజనులు కాళికాదేవి హిందువుల దైవమని, ఆమెను చాలా మంది అమ్మగా భావిస్తారని, అలాంటి కాళికామాతను కేటీ తన మూడ్‌తో పోల్చడం అవ‌మానం.. అంటూ కామెంట్లు పెట్టారు.

100 మిలియన్‌ ఫాలోవర్లతో

100 మిలియన్‌ ఫాలోవర్లతో

'96 అవర్‌', 'బిగ్‌ బ్రదర్‌' లాంటి కార్యక్రమాలతో 190 దేశాల అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు ఫాలోవర్స్‌ సంఖ్యను అమాంతం రెట్టింపు చేసుకుంది. 100 మిలియన్‌ ఫాలోవర్లతో కేటి అగ్రస్థానంలో నిలవగా.. 97 మిలియన్లతో పాప్‌ సింగర్‌ జస్టిన్‌ బీయిబర్‌, 85 మిలియన్‌ ఫాలోవర్లతో మరో పాప్‌ సంచలనం టేలర్‌ స్విఫ్ట్‌ తర్వాతి స్థానాల్లో నిలిచారు.

English summary
The US singer-songwriter Katy Perry has become the first person to reach 100m followers on Twitter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu