»   »  భర్త వేధింపులు: పోలీసులను ఆశ్రయించిన సింగర్ కౌసల్య

భర్త వేధింపులు: పోలీసులను ఆశ్రయించిన సింగర్ కౌసల్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాధారణ మహిళలు మాత్రమే కాదు... సెలబ్రిటీలకు సైతం గృహ హింస, వేధింపులకు గురవుతున్నారు. తాజాగా ఈ లిస్టులో ప్రముఖ తెలుగు గాయని, సంగీత దర్శకురాలు కౌసల్య కూడా చేరారు. తన భర్త వేధిస్తుండటంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. కౌసల్య ఫిర్యాదు అందుకున్న సంజీవరెడ్డి నగర్ పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం.

కౌసల్య భర్త పేరు బాలసుబ్రహ్మణ్యం. తన చిన్న నాటి స్నేహితుడైన బాలసుబ్రహ్మణ్యంను కౌసల్యం ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.... కొంత కాలంగా ఇద్దరూ విడిగానే ఉంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె తన కొడుకుతో కలిసి ఉంటోంది.

Singer Kausalya alleges harassment by husband

కౌసల్య కెరీర్ విషయానికొస్తే... పద్మావతి యూనివర్శిటీలో శాస్త్రీయ సంగీతంలో పీజీ పూర్తి చేసిన ఆమె ‘మీ కోసం' సినిమాతో సింగర్ గా కెరీర్ ప్రారంభించారు. తర్వాత ఆమె తెలుగులో సక్సెస్ ఫుల్ సింగర్ గా ఎదిగారు. టీవీ మ్యూజిక్ కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొన్నారు.

స్వర్గీయ నందమూరి జానకీరామ్ కుమారులు మాస్టర్ నందమూరరి తారక రామారావు, సౌమిత్రి ఈ చిత్రం ద్వారా బాల నటులుగా పరిచయం అవుతున్న ‘దాన వీర శూర కర్ణ' కర్ణ సినిమాకు కౌసల్య సంగీతం అందిస్తుండటం విశేషం. ప్రొఫెషనల్ లైఫ్ లో విజయవంతంగా దూసుకెలుతున్న కౌసల్య... పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు పడుతున్నట్లు తాజా సంఘటన బట్టి తెలుస్తోంది.

English summary
Tollywood play back singer Kausalya alleges harassment by husband.
Please Wait while comments are loading...