»   »  బిగ్‌బాస్ హౌస్‌లో బ్రతకడం ఎలా? తెలంగాణ సింగర్ మధు ప్రియ ఉద్వేగం!

బిగ్‌బాస్ హౌస్‌లో బ్రతకడం ఎలా? తెలంగాణ సింగర్ మధు ప్రియ ఉద్వేగం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బిగ్‌బాస్ తెలుగు షో ఆదివారం గ్రాండ్ గా మొదలైంది. మొత్తం 12 మంది సెలబ్రిటీలను పరిచయం చేస్తూ ఎన్టీఆర్ వారిని హౌస్ లోకి ప్రవేశ పెట్టారు. సింగర్ మధు ప్రియ, సమీర్, ముమైత్ ఖాన్, కత్తి కార్తీక, కత్తి మహేష్, ధనరాజ్, అర్చన, సంపూర్ణేష్ బాబు, శివ బాలాజీ, ప్రిన్స్ ఇలా ఒక్కొక్కరిని హౌస్ లోకి పంపారు.

హౌస్‌లోకి ప్రవేశించగానే సింగర్ మధు ప్రియ ఉద్వేగానికి లోనయ్యారు. హౌస్‌లోకి ప్రవేశించే ముందు ఆమె మాట్లాడుతూ.... ఈ షోలోకు ఎప్పుడు వెళ్తానా? ఎలా ఉంటుందనే ఎగ్జైట్మెంట్ ఉండేదని తెలిపింది.

ఎట్లా బ్రతుకుడో...?

ఎట్లా బ్రతుకుడో...?

మనం ఇంతకాలం టెక్నాలజీ మీద ఆధారపడి బ్రతికాం. కానీ బిగ్ బాస్ హౌస్‌లో 70 రోజుల పాటు సెల్ ఫోన్ కూడా లేకుండా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఎలా ఉంటాననే విషయంలో చాలా ఎగ్జైట్‌గా ఉన్నానని మధు ప్రియ తెలిపారు.

Bigg Boss will become a disaster show :Laxmi Ramakrishnan | Filmibeat Telugu
ఎన్టీఆర్ కాంప్లిమెంట్

ఎన్టీఆర్ కాంప్లిమెంట్

మీరు పాటలు చాలా బాగా పాడతారని, 70 రోజుల పాటు మీ పాటలు వింటూ సరదాగా గడుపుతారని మాత్రం నేను చెప్పగలను. ఆల్ ది బెస్ట్ అంటూ.... మధు ప్రియను బిగ్ బాస్ హౌస్ లోకి పంపారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

అర్చన స్వాగతం

అర్చన స్వాగతం

బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించిన మధు ప్రియకు నటి అర్చన స్వాగతం పలికారు. హాయ్ అక్కా.... హౌఆర్ యూ అంటూ మధు ప్రియ అర్చనను ఆలింగనం చేసుకున్నారు. వెల్ కం మై సిస్టర్ అంటూ అర్చన ఆమెను రిసీవ్ చేసుకుంది.

ముమైత్ కాన్

ముమైత్ కాన్

నైస్ టు సీయూ అంటూ ముమైత్ ఖాన్ మధు ప్రియకు స్వాగతం పలికింది. అక్కడే ప్రిన్స్, సమీర్ తదితరులను మధు ప్రియ పరిచయం చేసుకుంది.

English summary
Singer Madhu Priya entered Intro in BiggBoss TeluguShow. Jr NTR's Bigg Boss Telugu is said to be the most expensive TV show ever produced in Telugu. A massive house has been constructed at more than 10,000 square feet area, which has been equipped with 60 cameras. Hers is the full list of celebrity contestants.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu