»   » కొందరు పెద్ద నిర్మాతలు చాలా చీప్...: రఘు మాస్టర్ భార్య, సింగర్ ప్రణవి సంచలనం!

కొందరు పెద్ద నిర్మాతలు చాలా చీప్...: రఘు మాస్టర్ భార్య, సింగర్ ప్రణవి సంచలనం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు పాపులర్ సింగర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ భార్య ప్రణవి సినిమా ఇండస్ట్రీలో కొందరు సింగర్స్ పరిస్థితి ఎంతదారుణంగా ఉందో ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు.

తెలుగులో అనేక సినిమాలకు పాటలు పాడి నంది వార్డుతో పాటు పలు అవార్డులు అందుకున్న ఆమె తన రెమ్యూనరేషన్ గురించి షాకింగ్ వివరాలు వెల్లడించారు. ఐడ్రీమ్ మీడియా వారి డైలాగ్ విత్ ప్రేమ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చారు.

తన రెమ్యూనరేషన్

తన రెమ్యూనరేషన్

సినిమాల్లో తన రెమ్యూనరేషన్ ఒక సాంగుకే కేవలం 5 వేలు మాత్రమే అని తెలిపారు. కొందరు వెయ్యి, మూడు వేలు ఇచ్చి పాడమని అడుగుతారు. కొత్తగా వచ్చే సింగర్స్ ఫేం కోసం ఫ్రీగా పాడటానికి కూడా రెడీగా ఉన్నారు, అందుకే నిర్మాతలు సింగర్స్ కు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు అని తెలిపారు.

అక్కడే ఎక్కువ

అక్కడే ఎక్కువ

తనకు టెలివిజన్ సీరియల్ లేదా జింగిల్స్ కు పాడితనే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారు. ఒక పాటకు రూ. 30,000 వరకు ఇస్తారు. సినిమాల్లో మాత్రం నా రెమ్యూనరేషన్ 5 వేలుగా ఫిక్స్ చేసారు అని ప్రణవి తెలిపారు.

కొందరు పెద్ద నిర్మాతలే చాలా చీప్..

కొందరు పెద్ద నిర్మాతలే చాలా చీప్..

కొందరు పెద్ద నిర్మాతలు, పెద్ద పెద్ద ప్రొడక్షన్ సంస్థలు చాలా చీప్ గా రెమ్యూనరేషన్ పాడించుకోవాలని చూస్తారు అని ప్రణవి తెలిపారు. అయితే ఆయా సంస్థల పేర్లను మాత్రం ఆమె వెల్లడించారు.

కొందరు మాత్రం మా టాలెంట్ చూసి ఇస్తారు

కొందరు మాత్రం మా టాలెంట్ చూసి ఇస్తారు

అయితే అందరు నిర్మాతలు అలా కాదు. కొందరు మా వర్త్ చూసి రెమ్యూనరేషన్ ఇస్తారు. పెళ్లి చూపులు నిర్మాత ఆ సినిమా చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ తనకు రూ. 15 వేలు పే చేసినట్లు ప్రణవి తెలిపారు.

అలాంటివి కూడా జరిగాయి

అలాంటివి కూడా జరిగాయి

కొన్ని సినిమాల్లో నేను పాడిన పాటలకు శ్రేయ ఘోషల్ పేరు వేసారు. నా వాయిస్, ఆమె వాయిస్ చాలా దగ్గరా ఉంటుంది. సినిమాకు పబ్లిసిటీ కోసం ఇలాంటివి చేస్తారు. నాకు చెప్పి ఇలా చాలా సార్లు చేసారు, ఇలాంటివి చాలా జరుగుతాయి ఇండస్ట్రీలో అని ప్రణవి తెలిపారు.

నా అసిస్టెంట్లకు ఎక్కువ ఇస్తాను

నా అసిస్టెంట్లకు ఎక్కువ ఇస్తాను

రణవి భర్త, ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ మాట్లాడుతూ... ప్రణవి రెమ్యూనరేషన్ విని షాకయ్యాను. నేను నా వద్ద పని చేసే అసిస్టెంట్లు ఇంతకంటే సంపాదిస్తారు... అని తెలిపారు.

చాలా పోగొట్టారు

చాలా పోగొట్టారు

ఇండస్ట్రీలో కొందరు దారుణంగా ఉంటారు. మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ మ్యూజిక్ డైరెక్టర్ల వద్ద మన గురించి చాలా బ్యాడ్ గా చెబుతారు. అలా చెప్పి నాకు చాలా అవకాశాలు పోగొట్టారు అని ప్రణవి తెలిపారు.

రఘు ప్రేమను రిజక్ట్ చేసిన ప్రణవి

రఘు ప్రేమను రిజక్ట్ చేసిన ప్రణవి

రఘు, ప్రణవి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసింతే. అయితే తొలుత రఘు ప్రపోజ్ చేయగా ప్రణవి రిజక్ట్ చేసిందట. అయితే తర్వాత రఘు వెంట పడిమరీ ఆమె ప్రేమను దక్కించుకున్నారట. ఈ విషయాన్ని ఇంటర్వ్యూలో వెల్లడించారు.

గతేడాది వివాహం

గతేడాది వివాహం

2016 ఏప్రిల్ 21న రఘు మాస్టర్, ప్రణవి వివాహం జరిగిన సంగతి తెలిసిందే.

English summary
Popular female playback singer Pranavi made shocking revelations about the remunerations of singers. In her interview with Idream YouTube channel, Pranavi said that they usually pay Rs. 5000 per song.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu