»   » సీక్రెట్ ఔట్: సింగర్ ప్రణవి, డాన్స్ మాస్టర్ రఘు ప్రేమ వివాహం!

సీక్రెట్ ఔట్: సింగర్ ప్రణవి, డాన్స్ మాస్టర్ రఘు ప్రేమ వివాహం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్లో ఈ మధ్య పలువురు సింగర్లు ప్రేమ వివాహాలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే దారిలో మరో తెలుగు గాయని ప్రేమ వివాహం చేసుకోబోతున్న్లు తెలుస్తోంది. శ్రీరామదాసు, హ్యాపీడేస్, యమదొంగ, లయన్ తదితర చిత్రాల్లో తన గానంతో మంచి గురించి తెచ్చుకున్న ప్రణవి ఆచార్య ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ ను పెళ్లాడబోతున్నట్లు సమాచారం.

గత కొంత కాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని ఇన్నాళ్లు ఎవరికీ తెలియకుండా సీక్రెట్ మెయింటన్ చేస్తూ వచ్చారు. అయితే ఇటీవల ఆడియో వేడుకలో యాంకర్ ఝాన్సి వీరి ప్రేమ వ్యవహారం బయట పెట్టడం విషయం బయటకు లీకైంది. అయితే ఈ విషయంపై ఇద్దరూ ఇంకా స్పందించలేదు. త్వరలో తమ పెళ్లి విషయం ఖరారు చేసే అవకాశం ఉంది.

Singer Pranavi Acharya and Choreographer Raghu Master To Marry Soon

ప్రస్తుతం టాలీవుడ్లో టాపులో కొనసాగుతున్న కొరియోగ్రాఫర్లలో రఘు మాస్టర్ ఒకరు. ఆర్య2 సినిమా తర్వాత కొరియోగ్రాఫర్ గా పాపులర్ అయిన రఘు మిర్చి, జిల్, అఖిల్ తో పాటు అనేక చిత్రాలకు పని చేసారు. సింగర్ ప్రణవి కూడా సినీరంగానికి చెందిన వ్యక్తి కావడంతో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి విషయం అఫీషియల్ గా వెల్లడయ్యే వరకు మనం ఇంతకు మించి ఊహించుకోకపోవడమే మంచిది.

English summary
Singer Pranavi Acharya, who shot to fame with her songs in Sri Ramadasu, Happy Days, Yamadonga and Lion, is going to enter the wedlock with dance choreographer, Raghu Master.
Please Wait while comments are loading...