For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పబ్ వ్యవహారం మీద పెదవి విప్పిన రాహుల్.. అసలు జరిగింది ఇదే.. దేనికైనా సిద్ధమంటూ ప్రకటన!

  |

  హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పబ్‌ పార్టీ వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. తొలుత 150 మంది ఉన్నారు అని చెప్పిన పోలీసులు 142 మంది లిస్ట్‌ను విడుదల చేశారు. పార్టీకి హాజరైన వారిలో సెలబ్రిటీలు, ప్రముఖులు, ఉన్నతాధికారుల పిల్లలు కూడా ఉన్నట్లు పోలీసులు విడుదల చేసిన లిస్టులో తేలింది. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా పార్టీకి వెళ్లిన వాళ్లలో ఒకరిగా పొద్దు నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. అసలు రాహుల్ పార్టీకి ఎందుకు వచ్చారు. పబ్‌లో రాత్రి అసలేం జరిగింది.. అనే అంశాలపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మీడియాతో మాట్లాడారు. అసలు ఈ వ్యవహారం మీద ఆయన ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు

  బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు

  హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ హోటల్‌ లో నడుస్తున్న ఒక పబ్ మీద నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. సాధారణంగా పబ్బులు 1:00 లోపు మూసి వేయాల్సి ఉంటుంది. కానీ సమయం దాటిన తర్వాత కూడా నిర్వహిస్తున్నారనే సమాచారంతో రాడిసన్‌ బ్లూ హోటల్‌లో నిర్వహిస్తున్న ఫుడింగ్‌ మింగ్‌ పబ్‌పై స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్‌ చేశారు. ఆ సమయంలో పోలీసులు వెళ్లేసరికి దాదాపు 150 మంది యువతీ యువకులు తాగుతూ, తూగుతూ ఎంజాయ్‌ చేస్తున్న దృశ్యాలు కంట పడ్డాయి. ముందుగా అక్కడ ఉన్న వారందరినీ పోలీసులు దగ్గర్లో ఉన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు

  హై ప్రొఫైల్ వ్యక్తుల కుటుంబాలకు

  హై ప్రొఫైల్ వ్యక్తుల కుటుంబాలకు

  అయితే పోలీసులు రావడం చూసి కొంత మంది యువతీ యువకులు తమ దగ్గర ఉన్న కొన్ని డ్రగ్స్ ప్యాకెట్లను బాత్రూంలో, కిటికీలో నుంచి బయటకు ఎందుకు ప్రయత్నించడం అక్కడ పోలీసులు గమనించారు. మొత్తం ఆ ప్యాకెట్ లు అన్నీ సేకరించగా డ్రగ్స్ వాడుతున్నట్లు పోలీసులు తేల్చారు. డ్రగ్స్ కూడా బయటపడటంతో పబ్‌ నిర్వాహకులతో పాటు 150 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దాదాపు 150 మంది సెలబ్రిటీలు హై ప్రొఫైల్ వ్యక్తుల కుటుంబాలకు చెందిన వారే కావడంతో కొంత మందికి నోటీసులు ఇచ్చి రాత్రి పంపించగా, మరికొంతమందిని విచారించి ఉదయం పంపించారు.

  అరెస్ట్ చేశారని

  అరెస్ట్ చేశారని

  సాధారణంగా అయితే పెద్ద విషయం అయ్యేది కాదు కానీ ఈ పబ్బులో సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలు ఉండటంతో ఈ వార్త సంచలనంగా మారింది. ఈ సంఘటనలో పలువురి పేర్లు బయటకు రాగా అందులో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పేరు ప్రముఖంగా వినిపించింది. గతంలో కూడా రాహుల్ సిప్లిగంజ్ ఇలాగే ఒక పబ్ లో వేరే వ్యక్తులతో గొడవ పడడంతో అతని మీద దాడి జరగడంతో ఈ సారి కూడా అలాగే పబ్ వ్యవహారంలో అతని పేరు తెరమీదకు వచ్చింది. నిన్న రాత్రి రాహుల్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారని, ఆ తర్వాత నోటీసులు ఇచ్చి పంపించారు అని మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో రాహుల్ అరెస్టయ్యాడు అంటే కచ్చితంగా డ్రగ్స్ తీసుకునే ఉంటాడు అని కొందరు కామెంట్లు చేస్తున్నారు..

   ఫ్రెండ్ బర్త్ డే పార్టీ ఉండటంతో

  ఫ్రెండ్ బర్త్ డే పార్టీ ఉండటంతో

  అయితే ఇదంతా ఎందుకు అనుకున్నాడో ఏమో తెలియదు కానీ స్వయంగా మీడియా ఛానళ్లకు రాహుల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీ ఉండటంతోనే తాను పబ్‌కు వెళ్లానని రాహుల్ క్లారిటీ ఇచ్చాడు. అయితే డ్రగ్స్ తీసుకున్నారా అని అడిగా మీడియా ప్రతినిధులకు అసలు తనకు డ్రగ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదని రాహుల్ సమాధానం ఇచ్చాడు. ఒకవేళ నిజంగా డ్రగ్స్ తీసుకుంటే ఇప్పుడు ఇంట్లో ఎందుకు కూర్చుంటానని కూడా రాహుల్ ప్రశ్నించాడు. అడ్డంగా దొరికిపోయారు అంటూ సోషల్ మీడియాలో తమను టార్గెట్ చేస్తూ ప్రచారం చేయడం తగదని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశాడు. నిజానికి అసలు పబ్బుకు పుట్టినరోజు జరుపుకుంటున్న స్నేహితుడికి శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్లానని రాహుల్ చెప్పుకొచ్చాడు.

  తమను కూడా ఆపి వేశారని

  తమను కూడా ఆపి వేశారని

  మేము వెళ్లి కొంచెం సమయం గడిపి తిరిగి వస్తూ ఉండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చారని, మేము వెళుతూ ఉండగా ఎక్కడికి వెళ్లే వీలు లేదు అని తమను కూడా ఆపి వేశారని ఆయన అన్నారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే వారిని అదుపులోకి తీసుకున్నారు అని తాను భావించానని కానీ వాళ్ళు వచ్చి అక్కడ ఉన్న 150 మందిని తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు అని చెప్పుకొచ్చారు.. అసలు అక్కడ తమను కాదు తీసుకు వెళ్లాల్సింది నిర్ణీత సమయానికి పబ్ మూయకపోతే నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి కానీ తమను ఇబ్బంది పెట్టడం సరికాదని రాహుల్ చెప్పుకొచ్చాడు.

  Recommended Video

  RRR లో మల్లి..ఎవరీ చిట్టితల్లి? Twinkle Sharma లైఫ్ మలుపు తిప్పిన యాడ్ | Filmibeat Telugu
  ఎటువంటి టెస్టులకైనా సిద్ధం

  ఎటువంటి టెస్టులకైనా సిద్ధం


  ఇక ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు మీరు చూశారా అని అడిగితే అక్కడ 150 మంది ఉన్నారు ఒకవేళ వాళ్ళు తీసుకున్న మా కంట కనపడే అవకాశం అయితే ఉండదు అని రాహుల్ చెప్పుకొచ్చాడు. అంతే కాక పబ్ నుంచి బయటకు వెళ్లాలంటే 15-20 నిమిషాలు టైం పడుతుందని.. క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్లే పబ్ నుంచి బయటకు వెళ్లడం ఆలస్యమైందని రాహుల్ సిప్లిగంజ్ పేర్కొన్నారు. రాడిసన్ క్లబ్‌కు తాను వెళ్లడం ఇది రెండోసారి డ్రగ్స్ తీసుకున్న వ్యవహారంపై తాను ఎటువంటి టెస్టులకైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మొన్నటి వరకు పోలీసులతో కలిసి డ్రగ్స్‌పై ఎవేర్‌నెస్ కల్పించిన వ్యక్తిని తాను అని.. అలాంటిది తాను ఎందుకు డ్రగ్స్ వాడతానని రాహుల్ సిప్లిగంజ్ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి తప్పు చేయకపోయినా తనపై వివాదాలు సృష్టిస్తున్నారని రాహుల్ సిప్లిగంజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

  English summary
  Singer Rahul sipligunj responded on Hyderabad pub issue.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X