»   » 'బాహుబలి' కిలికి భాషలో స్మిత పాట (వీడియో)

'బాహుబలి' కిలికి భాషలో స్మిత పాట (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహించిన 'బాహుబలి' చిత్రానికి అభినందనగా పాప్‌ గాయని స్మిత ఓ పాట పాడారు. సోషల్‌ మీడియా ద్వారా ఈ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో బాహుబలి చిత్రంలో కాలకేయ పాత్ర పోషించిన ప్రభాకర్‌తో కలిసి స్మిత కిలికి భాషలో పాటను షూట్ చేసారు.

దీనికి గానూ బాహుబలి చిత్ర యూనిట్ ఆమెకు ట్విట్టర్‌ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో జులై 10న విడుదలైన బాహుబలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రికార్డుస్థాయిలో వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో కిలికి అనే ప్రత్యేక భాషతో కాలకేయగా నటుడు ప్రభాకర్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాహుబలి: ది కన్‌క్లూజన్‌ షూటింగ్‌ గురువారం రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభమైంది. ప్రభాస్, రమ్యకృష్ణ మీద వచ్చే సన్నివేశాలతో ఈ షూటింగ్ ప్రారంభమైంది. రెగ్యులర్ గా ఈ షూటింగ్ ఎటువంటి బ్రేక్ లేకుండా జరగనుంది. గత కొద్ది రోజులుగా ఈ చిత్రం సెట్స్ వేస్తూండటం, స్క్రిప్టుపై కసరత్తులతో టీమ్ గడపింది.

Singer Smitha’s Baha Kilikki Video Song Launch

ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. జులై 10న విడుదలైన బాహుబలి: ది బిగినింగ్‌ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించిన సంగతి తెలిసిందే.

English summary
Smita’s ‎BahaKilikki‬ is all set to enthral the audiences with its foot tapping beats and enticing visuals. Smita takes this opportunity to thank the media for continued support and encouragement. She truly feels blessed for love and affection showered by her fans and her music fraternity for always being with her in her creative endeavours.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu