For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిన్నగా నొప్పి మొదలైంది.. సాధారణంగా వాటిని మనం లెక్కచేయం.. కరోనా పాజిటివ్‌పై సునీత

  |

  కరోనా వైరస్ ప్రస్తుతం ఉగ్రరూపం దాల్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వారు వీరు అని తేడా లేకుండా అందరూ కరోనా బారిన పడుతున్నారు. వీరిలో ఎక్కువగా సినీ పరిశ్రమకు చెందిన వారే కావడం గమనార్హం. అందులోనూ మరీ ముఖ్యంగా బుల్లితెర పరిశ్రమకు చెందిన వారు కావడం ఆందోళన కలిగించే విషయం. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల మేరకు షూటింగ్‌లు జరుపుతుండటంతో కరోనా కలకలం సృష్టిస్తోంది.

  Serial Actor Ravi Krishna,Shiva Jyothi Live About His Corona కరోనా గురించి మాట్లాడిన రవికృష్ణ
   బుల్లితెరపై కరోనా పంజా..

  బుల్లితెరపై కరోనా పంజా..

  ప్రస్తుతం బుల్లితెరకు సంబంధించిన షూటింగ్‌లో నడుస్తున్నాయి. చిత్ర సీమలో ప్రస్తుతం కరోనా తాండవం చేస్తోంది. రోజుకో నటుడికి, టెక్నీషియన్‌కి కరోనా పాజిటివ్ అని తేలుతోంది. వీటికి తగ్గట్టు బుల్లితెర నటులు స్పెషల్ ఈవెంట్స్ అంటూ పెద్ద మొత్తంలోషూటింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెరపై కరోనా తన ప్రభావాన్ని చూపుతోంది.

   కరోనా కేసులు..

  కరోనా కేసులు..

  బుల్లితెర నటీనటులు, హీరోహీరోయిన్లకు కరోనా సోకుతోంది. ఈ క్రమంలో పలు సీరియల్ యాక్ట్సస్‌కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఆమె కథ ఫేమ్ నవ్యస్వామి, కార్తీక దీపంలో మరో నటికి, బిత్తిరి సత్తి ఇలా ఎంతో మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా ఇద్దరు సింగర్లు కరోనా బారినపడ్డారనే వార్త వైరల్ అవుతోంది.

  ఆ ఇద్దరికీ కరోనా..

  ఆ ఇద్దరికీ కరోనా..

  సింగర్ మాళవిక, సింగర్ సునీతలకు కరోనా పాజిటివ్ అనే వార్తలు దావానంలా వ్యాప్తి చెందాయి. అయితే వీటిపై క్లారిటీ ఇచ్చేందుకు సునీత ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఫేస్ బుక్‌లో ఓ వీడియోను షేర్ చేస్తూ.. ‘అందరికీ నమస్కారం. నా ఆరోగ్యం గురించి బంధువులు, స్నేహితులు, మీడియా నుంచి వరుస ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. దీనిపై స్పష్టత ఇచ్చేందుకే మీ ముందుకు వచ్చా.

  వాటిని లెక్కచేయం..

  వాటిని లెక్కచేయం..

  కొన్ని రోజుల కిందట నేను కరోనా బారిన పడ్డా. ఒక షూటింగ్‌కు వెళ్తే తలనొప్పిగా అనిపించింది. అశ్రద్ధ చేయకుండా నా తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకుని పరీక్ష చేయించుకున్నా. దురదృష్టవశాత్తూ పాజిటివ్‌ అని వచ్చింది. చాలా స్వల్ప లక్షణాలు ఉన్నాయి. సాధారణ జీవితంలో అలాంటివి మనం లెక్క చేయం.

   బాలుగారి విషయంలో..

  బాలుగారి విషయంలో..

  ఇప్పుడు నేను పూర్తిగా కరోనా కోలుకున్నా. ఆరోగ్యంగానే ఉన్నాను. ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు తీసుకుంటూ, జాగ్రత్తలు పాటిస్తూ, వ్యాధి నుంచి బయటపడ్డా. ఇదే విషయాన్ని మీకు చెప్పాలనుకున్నా. అయితే, ఇప్పుడు నేను బాలుగారి ఆరోగ్యం విషయంలో చాలా ఆందోళనగా ఉన్నా. నేను, నా కుటుంబం ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. మీరందరూ కూడా సురక్షితంగా ఉండండి. దేన్నీ తేలికగా తీసుకోకండి. మీరు చూపెడుతున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు' అని చెప్పుకొచ్చింది.

  English summary
  Singer Sunitha About Corona Positive. Sunitha is the recent celebrity who got infected by the coronavirus recently. she Went To music program for a TV channel and then further she got infected by the virus.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X