»   » మహేష్ బాబు ఆఫర్ రిజక్ట్ చేసిన సింగర్ సునీత, కారణం అదేనా?

మహేష్ బాబు ఆఫర్ రిజక్ట్ చేసిన సింగర్ సునీత, కారణం అదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కే ‘బ్రహ్మోత్సవం' చిత్రంలో సింగర్ సునీత నటిస్తున్నట్లు, ఆమె ఓకే చెప్పినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో గాయని సునీతను కూడా నటింపజేయాలని మహేష్ బాబు స్వయంగా కోరినట్లు, ఆమెను వదిన పాత్రలో నటింప చేయాలని భావించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై సునీత స్పందించారు. ఆ సినిమాలో నటించడం లేదని స్పష్టం చేసారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం స్పష్టం చేసారు.

ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ....శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేశ్‌బాబు నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం'లో నటిస్తున్నానని అభినందిస్తూ ఫోన్లూ, మెసేజ్ లు వస్తున్నాయి. కానీ నేను నటిస్తున్నట్లు వచ్చిన ఆ వార్త నిజం కాదు. ఆ పాత్రకు నేనైతే బాగుంటుందని చిత్ర యూనిట్‌లో అనుకొని ఉంటారు. ఇంతలో ఆ వార్త అలా బయటకు వచ్చేసుంటుంది' అన్నారు.

Singer Sunitha Declined Mahesh Babu's Offer

నటించే ఉద్దేశ్యం లేదా? అనే ప్రశ్నంకు స్పందిస్తూ ..... జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో, ఏ టైమ్ కి ఏమవుతుందో ఎవరు చెప్ప గలం? బలమైన పాత్రచిత్రణ ఉండి, సంగీత ప్రధానమైన కథతో, ఏ ఆఫ్‌బీట్ సినిమా ఆఫర్‌తోనో ఎవరైనా కలిస్తే నటిస్తానేమో అన్నారు. సినిమాలో నటిస్తే డబ్బు, పాపులారిటీ వస్తుంది కదా అనే ప్రశ్నకు స్పందిస్తూ.... గాయనిగా నాకు ఇప్పటికే ఒక హీరోయిన్‌కు ఉండేంత పాపులారిటీ ఉంది. అందుకే, నన్నింకా ఎగ్జయిట్ చేసే పని చేయాలనిపిస్తోందని సమాధానం ఇచ్చారు.

ఈ సినిమాలో సునీత తన పాత్ర నచ్చకనే రిజక్ట్ చేసినట్లు టాక్. నటన పరంగా తన ఎంట్రీ ఇలా వదిన పాత్రలో సాదా సీదాగా కాకుండా డిఫరెంటుగా ఉండాలని ఆమె భావిస్తోందని, అందుకే ఆమె ఈ ఆఫర్ రిజక్ట్ చేసినట్లు సమాచారం.

English summary
It is known that Singer Sunitha was offered to play a pivotal role in Mahesh Babu's upcoming film, Brahmotsavam, under the direction of Srikanth Addala. But the singer turned down the offer as she prefer to debut onscreen with an offbeat film.
Please Wait while comments are loading...