»   » 'హి చీటెడ్ మి ..క్యారక్టర్ లెస్ ఫెలో' , లింక్ లు పెట్టేసారు... స్పష్టంగా చెప్పేసిన సింగర్ సునీత

'హి చీటెడ్ మి ..క్యారక్టర్ లెస్ ఫెలో' , లింక్ లు పెట్టేసారు... స్పష్టంగా చెప్పేసిన సింగర్ సునీత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ' బాధ నుంచి బయటపడడానికి ఆరేళ్ల క్రితం ఓసారి, రీసెంట్‌గా మరోసారి సైకియాట్రిస్ట్‌ని కలిసి డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి టాబ్లెట్స్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ ఎవరికి తెలుసు? ఇక్కడ ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే.. సొసైటీలో ఓ వ్యక్తి గురించి ఒక రకమైన ఇంప్రెషన్ ఉంటుంది. వాళ్ల జీవితం గురించి తెలుసుకోకుండానే ఓ అభిప్రాయం ఏర్పరచుకుంటారు. అది చాలా తప్పు.' అంటున్నారు ప్రముఖ గాయని సునీత.

సింగర్ సునీత తెలియనివారు తెలుగులో తక్కువ. ఆమె పాట వినని మరీ తక్కువనే చెప్పాలి. అంతగా ఆమె తెలుగువారి జీవితాల్లోకి వెల్లిపోయింది. ఆమె మాధుర్యమైన వాయిస్, అంతకు మించి అందమైన సింగర్ అనే పేరు తెచ్చుకున్న సునీత...ఏదో ఒక రాంగ్ కారణాలతో మీడియా లో నానుతోంది. ఆమె అందమే శాపమా అన్నట్లుగా ఎప్పుడూ ఏదో ఒక రూమర్ మీడియాలో వస్తూనే ఉంది.

ఆ రూమర్స్ సునీత అభిమానులను కలవరపరుస్తూనే ఉంది. అయితే ఆ రూమర్స్ లో నిజానిజాలెంత..అసలు ఆమె పర్శనల్ లైఫ్ లో ఎన్ని కష్టాలు పడింది...వంటి విషయాలను ప్రముఖ తెలుగు దినపత్రిక సాక్షితో మాట్లాడుతూ తెలియచేసింది. ఆ ఇంటర్వూలో కొన్ని అంశాలను మీకు అందిస్తున్నాం.

ఈ ఇంటర్వూ చదివిన తర్వాత నిజంగా ఆమె పర్శనల్ లైఫ్ లో ఇన్ని కష్టాలు పడిందా...రూమర్స్ గా వినే వార్తలు వెనుక ఇన్ని నిజాలు ఉన్నాయా అని ఖచ్చితంగా అనిపించకపోదు. తన భర్త తో బ్రేకప్ ఎందుకు అయ్యింది. మధుయాష్కితో లింక్ అంటూ వచ్చిన వార్తలు, సీక్రెట్ మ్యారేజ్ రూమర్స్ వీటిన్నటి గురించి మాట్లాడారామె.

స్లైడ్ షోలో ఇంటర్వూలోని కొన్ని విశేషాలు...సునీత స్వయంగా చెప్పినవి యధాతథంగా

భర్తతో బ్రేకప్ కి కారణం

భర్తతో బ్రేకప్ కి కారణం

మోసం చేసే లక్షణం అవతలి వ్యక్తికి ఉండటం వలన దూరం పెట్టాల్సి వచ్చింది. మనుషులు మారతారేమో అని ఎదురు చూశాను.. మారలేదు. నేను విడాకులు తీసుకున్నానని అందరూ అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. విడి విడిగా ఉంటున్నాం .నా బ్రేకప్ మా పిల్లలపై ఏమీ ప్రభావం ఏమీ చూపించలేదు.

డబ్బులు తీసుకున్నాడు

డబ్బులు తీసుకున్నాడు

కలిసి ఉన్నప్పుడు ఎంత అజ్ఞానంలో బతికాననేది విడిపోయిన తర్వాత తెలిసింది. మా ఇద్దరికీ పరిచయం ఉన్నవాళ్లలో కనీసం నలుగురు వ్యక్తుల దగ్గరైనా నాకు తెలియకుండా డబ్బులు తీసుకున్నాడు. 'ఎందుకలా చేశావ్?' అని అడిగితే.. 'నిన్ను ఇవ్వమని అడిగారా.. అడగలేదు కదా.. ఎందుకు బాధపడుతున్నావ్' అనేవాడు. అంత కూల్‌గా ఎలా ఉండగలుగుతాం? డబ్బులిచ్చిన ప్రతివాళ్లూ... మీ పేరు చెప్పడంవల్లే ఇచ్చామన్నారు.

ఏ వయసులో పెళ్లి?

ఏ వయసులో పెళ్లి?

19 ఏళ్లకే చేసుకున్నాను. ఇప్పుడు నాకు 37 ఏళ్లు. 19 ఏళ్ల వయసులో పెళ్లంటే.. మానసికంగా మెచ్యూర్టీ లెవల్స్ అంతగా ఉండే అవకాశం లేదు.. మెంటల్‌గా మెచ్యూర్టీ లెవల్స్ లేని టైమ్‌లో పెళ్లి చేసుకున్నా.

కానీ...

కానీ...

జీవితం అంటే ఏంటో కూడా అవగాహన లేదప్పుడు. చాలామంది పైకి ఆనందంగా కనిపిస్తున్నవారిని చూసి, 'ఎవ్విరీ థింగ్ ఈజ్ ఫైన్' అనుకుంటారు. కానీ, కాంప్రమైజ్‌లు, ఎన్నో త్యాగాలు చేస్తే.. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కలసి చాలా హ్యాపీగా ఉంటారు. అందర్నీ అనడం లేదు. కొన్ని జంటల పరిస్థితి మాత్రం ఇదే.

అందరి భాథ్యతా నాదే

అందరి భాథ్యతా నాదే

'ఐయామ్ ద బ్రెడ్ అండ్ బటర్ ఫర్ మై ఫ్యామిలీ'. మా అత్తగారు, మామగారు, మామగారి అమ్మ, మా అమ్మానాన్న, నాన్నమ్మ, పిల్లలు... అందరి బాధ్యత నాదే.

అంతా కొలాప్స్

అంతా కొలాప్స్

బాగా ఎనర్జిటిక్‌గా ఉన్నప్పుడు ఝాన్సీ లక్ష్మీభాయిలా అనిపిస్తుంది. అందరి బాగోగులూ చూస్తాం. జీవితంలో అలసట ప్రారంభమైనప్పుడు మొదలవుతుంది అసలు సమస్య. ఇంత చేస్తున్నాం.. మన గురించి ఎవరూ పట్టించుకోవడం లేదేంటి? మన గురించి ఆలోచించేవాళ్లు లేరా? అనిపించినప్పుడు అంతా కొలాప్స్ అవుతుంది.

విడిపోవాలని నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం?

విడిపోవాలని నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం?

పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలనేది నా తపన. బాధ్యత ఉన్న వ్యక్తిని చూసి ఎంత నేర్చుకుంటారో... బాధ్యతారాహిత్యమైన వ్యక్తిని (భర్త కిరణ్‌ని ఉద్దేశించి) చూసి, బంధాలకు విలువ ఇవ్వనివాళ్లను చూసి కూడా అంతే నేర్చుకుంటారు. పెరిగే వయసు కదా. అందుకే, ఇక కాంప్రమైజ్ కాదల్చుకోలేదు.

ఆ బాధ

ఆ బాధ

పడేవాళ్లకే బాధ తెలుస్తుంది... కానీ, ఎలా ఉన్నా సర్దుకుపోవాలని మన సమాజం చెప్తుంది కదా? నా పిల్లల స్కూల్ ఫీజ్ కట్టమని, నేను ఎమోషనల్‌గా డౌన్ అయినప్పుడు ఓదార్చమని సమాజానికి చెప్పండి.

చెడుగా మాట్లాడేవాళ్లకు సమాధానం

చెడుగా మాట్లాడేవాళ్లకు సమాధానం

నేను రోడ్డు మీద వెళ్తుంటే నా గురించి చెడుగా మాట్లాడే వాళ్ల నోళ్లు మూయించమని చెప్పండి. నా పిల్లలకి సమాధానం చెప్పమనండి. ప్రతి నెలా నాకు ఇంత అమౌంట్ ఇవ్వమనండి. ఆ డబ్బుతో నా కుటుంబాన్ని చూసుకోవడంతో పాటు సమాజసేవ కూడా చేస్తా.

పిల్లలకు తెలుసు

పిల్లలకు తెలుసు

విడిపోవాలనుకున్న తర్వాత మీ పిల్లలతో ఏదీ డిస్కస్ చేయాల్సిన అవసరం లేకుండానే.. ఎవరేంటి? ఎవరేం చేస్తున్నారు? అనేది వాళ్లు చూశారు. నేను చేసిన మంచి పని ఏంటంటే.. ఎదుటి వ్యక్తి గురించి పిల్లల దగ్గర చెడుగా చెప్పలేదు. ఎవరంతట వాళ్లు తెలుసుకోవాలని నేను నమ్ముతాను.

చీట్ చేసాడు

చీట్ చేసాడు

మాది ఇట్స్ నాట్ ఏ లవ్ మ్యారేజ్. కానీ అటువంటిదే. జీవిత భాగస్వామిని నమ్మాలి, నమ్మాను. అవతలి వ్యక్తి తప్పులు చేసి, వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఊరుకోగలమా? ఎవ్వరినైనా భరించవచ్చు గానీ, పక్కనే ఉంటూ మోసం చేస్తూ, బయట అమ్మా.. బుజ్జీ.. కన్నా.. అంటూ మాట్లాడేవాళ్లని భరించలేం. 'హి చీటెడ్ మి'.

ఐడెంటిటీ లేదు

ఐడెంటిటీ లేదు

సునీత భర్త కాకపోతే అతనికి బయట ఐడెంటిటీ లేదు. 'సునీత చాలా కష్టాల్లో ఉంది. అడగలేకపోతోంది. నా కూతురికి ఏదో అవసరం వచ్చింది' అని నా పేరు వాడుకోకపోతే డబ్బులు ఎవరిస్తారు?

పిల్లలు నాతోనే

పిల్లలు నాతోనే

పిల్లలు నా తోనే ఉంటున్నారు కదా.. నాన్నతో ఉంటామని ఎప్పుడూ అనరు. వాళ్లకా డిఫరెన్స్ కూడా తెలియకుండా పెంచానని గర్వంగా చెప్పగలను. నేనేదో గొప్ప పని చేశానని ఫీలవడం లేదు కానీ అలా పెంచే అవకాశం వచ్చింది.

నాకో గర్వం

నాకో గర్వం

సింగిల్ హ్యాండెడ్‌గా రెండు రోల్స్ (అమ్మానాన్న) ప్లే చేయలేమా? దీన్నో సవాలుగా స్వీకరించాను. ఇండియాలో మంచి యూనివర్శిటీలో నా కొడుకు చదువుతున్నాడు. అది తల్లిగా నాకో గర్వం.

సినిమాల్లోకి రావాలని ఉందన్నాడు

సినిమాల్లోకి రావాలని ఉందన్నాడు

వాళ్లకి ఓ మంచి జీవితాన్ని ఇస్తున్నాను. అంతకంటే ఏం కావాలి? వాళ్ల నాన్న ప్రభావమో.. మరొకటో.. వాడికి సినిమాల్లోకి రావాలనుంది. పీజీ వరకూ చదివి ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అన్నా. 'వాటీజ్ గుడ్.. బ్యాడ్.. రియల్' అనే విషయాలపై అప్పటికి వాడికి ఓ క్లారిటీ వచ్చేస్తుంది కదా.

విడాకులు ఇవ్వమని అడగలేదా?

విడాకులు ఇవ్వమని అడగలేదా?

ఇవ్వడు. 'నీకు విడాకులు కావాలని ఎంత గొడవ చేసినా, ఇవ్వను' అని భయపెడతాడు.

క్యారక్టర్ లెస్ ఫెలోనే

క్యారక్టర్ లెస్ ఫెలోనే

నా దృష్టిలో భార్యాపిల్లల పట్ల బాధ్యతగా లేనివాడు క్యారెక్టర్‌లెస్ ఫెలోనే. ఈ రోజుకీ నా కొడుకు ఏ యూనివర్శిటీలో చదువుతాడో అతనికి తెలియదు. తెలుసుకోవాలని అనుకోడు. అంత ఇర్రెస్పాన్సిబుల్.

మధుయాష్కీతో

మధుయాష్కీతో

మధు యాష్కీగారితో ఎవరికి శత్రుత్వం ఉందో నాకు తెలియదు. దానికి నేను బలయ్యాను. ఓ బ్యూటిఫుల్ సింగర్‌తో ఆయనకేదో ఉందని వార్తలు రాయడం మొదలుపెట్టారు. ఉన్న బ్యూటిఫుల్ సింగర్స్‌లో నేనూ ఒకదాన్ని కావడంతో చాలామంది నా పేరు ఫిక్స్ చేసేశారు. అదెంత అన్యాయమో చెప్పండి.

ఏదైనా మాట్లాడొచ్చు

ఏదైనా మాట్లాడొచ్చు

నా పక్కన ఓ స్ట్రాంగ్ పర్సన్ ఉండి ఉంటే ఇలాంటి రూమర్స్ వస్తాయా? లేకపోవడంతో ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు అన్నట్లయిపోయింది. భర్త ఎలా ఉన్నా సర్దుకుపోయి ఉంటే 'సునీత గ్రేట్' అని గొప్పగా మాట్లాడుకునేవారు. లింకప్ రూమర్స్ కూడా వచ్చి ఉండేవి కావు.

ఎమోషనల్ టార్చర్

ఎమోషనల్ టార్చర్

నన్ను ఎమోషనల్‌గా టార్చర్ చేసిన వాళ్లు చాలామంది ఉన్నారు. నా పర్సనల్ లైఫ్‌లో వచ్చిన సమస్యల కారణంగా చాలా అవకాశాలు తగ్గాయి. ఆ తర్వాత వాళ్లంతట వాళ్లే తెలుసుకుని 'మేం తప్పు చేశాం.. సారీ' అని చెప్పి, అవకాశం ఇస్తున్నారు.

పరిచయం అయ్యాక

పరిచయం అయ్యాక

నాతో పరిచయం లేనివాళ్లు నా గురించి ఏవేవో మాట్లాడతారు. పరిచయం అయ్యాక 'మీరింత మంచి మనిషి అనుకోలేదు' అంటారు.

ఇంకో పెళ్లి

ఇంకో పెళ్లి

నా పిల్లలు, స్నేహితులు.. నా చుట్టూ మంచి వ్యక్తులు ఉన్నారు. అందరూ నా ఎమోషన్స్‌ని అర్థం చేసుకునేవాళ్లే. అందుకే, నాకు మళ్లీ పెళ్లి చేసుకునే అవసరం కనిపించడం లేదు.

సీక్రెట్ మ్యారేజ్

సీక్రెట్ మ్యారేజ్

విడిపోయాక అతని తాలూకు వాళ్లు నాతో లేరు. నా పిల్లలు, అమ్మా, నాన్న, నానమ్మ... నా చుట్టూ మనుషులే. ఇల్లీగల్ రిలేషన్‌షిప్ పెట్టుకోవాలనుకునేవారు ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. నా ఇంటికి వచ్చి నా చుట్టూ ఉన్న మనుషులను చూసిన తర్వాత, 'ఈవిడగార్ని పెళ్లి చేసుకుంటే మన పరిస్థితి అంతే' అనుకోనివాళ్లు ఉండరు.

ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్

ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్

నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌లో ఉన్నారనే వార్త కూడా... సదరు కిరణ్‌గారి వల్లే ఈ పేరు కూడా వచ్చింది. నాకు ఒక్క పైసా అప్పు చేసే అలవాటు లేదు. ఉంటే తింటాను. లేకపోతే లేదు. నా డిగ్నిటీని వదులుకునే పనులు ఏ రోజూ చేయలేదు. చేయను.

క్యారక్టర్ బ్యాడ్ చేసాడు

క్యారక్టర్ బ్యాడ్ చేసాడు

సునీత ఫైనాన్షియల్‌గా ఇబ్బందుల్లో ఉందని చెప్పి, నా క్యారెక్టర్ బ్యాడ్ చేశాడు. 'సునీత నన్ను ఇంట్లోంచి వెళ్లగొట్టింది. తినడానికి తిండి లేదు. వారం రోజులుగా హాస్పిటల్‌లో ఉన్నాను, ఎవ్వరూ పట్టించుకోవడం లేదు' అని చెప్పుకున్నవాడు విడాకులు ఎందుకు ఇవ్వడం లేదు? *

పీక్స్ లో

పీక్స్ లో

ఒకప్పుడైతే.. కిరణ్ గారి గురించి ఇంత ఘాటుగా చెప్పేదాన్ని కాదేమో. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నానంటే నా సహనాన్ని పీక్స్‌లో పరీక్షించాడు. ఎవరికీ తె లియకుండా ఎంత ఏడ్చానో నాకే తెలుసు (చెమర్చిన కళ్లతో).

పట్టించుకోడు

పట్టించుకోడు

'తిన్నావా.. ఏ సినిమా చూశావ్? ఎలా ఉన్నావ్?' అని కొడుక్కి ఫోన్ చేసి, మాట్లాడతాడు. ఫైనాన్షియల్‌గా కాకపోయినా పిల్లాడికి ఏ కాలేజ్ మంచిది? ఏం చేస్తే మంచిది?.. ఇవన్నీ మాత్రం పట్టించుకోడు (కన్నీళ్లు పెట్టుకుంటూ).

మార్చలేం

మార్చలేం

మీ భర్తని మార్చుకోవడానికి ప్రయత్నించవచ్చు కదా..? అంటే... సగం తెలిసినవాడితో మాట్లాడొచ్చు. తెలియనివాడికి తెలియజెప్పొచ్చు. అన్నీ తెలిసిన వాళ్లను మార్చలేం కదా. వాళ్లు పరమ మూర్ఖుల కింద లెక్క.

చివరిసారిగా అతనితో..

చివరిసారిగా అతనితో..

చివరిసారిగా అతనితో రీసెంట్‌గా మాట్లాడాను. 'ఎందుకిలా ?.. డబ్బుల గురించి వదిలెయ్. బాధ్యత తీసుకో. పిల్లాడు పెద్ద చదువులకు వెళుతున్నాడు. గెడైన్స్ ఇవ్వు' అన్నాను. 'నాకంటే నీకు బాగా తెలుసు కదమ్మా' అన్నాడు. తప్పించుకునే తత్వం అది.

మోసంచేసాడు

మోసంచేసాడు

ఏ భార్య అయినా భర్త నుంచి కోరుకునేది 'నీకు నేను ఉన్నాను' అనే నమ్మకం. పక్కన ఉంటూనే దారుణంగా మోసం చేశాడు. ఏ మనిషికైనా మారడానికి కాస్త టైం ఇవ్వాలి. ఎక్కువ టైమ్ ఇచ్చి చూశాను కాబట్టి.. ఇప్పుడు అతని గురించి ఓపెన్‌గా మాట్లాడా.

English summary
Breaking her silence on mystery shrouding her personal life, Singer Sunitha has finally spoken about her private life in public. In a candid interview to a leading vernacular, Sunitha has set the record straight.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu