Just In
- 49 min ago
ప్రభాస్ హీరోయిన్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్.. అది నా డిక్షనరీలో లేదంటూ తండ్రి కామెంట్
- 51 min ago
RRRకు భారీ ఎదురుదెబ్బ: సినిమాలోని మెయిన్ సీక్వెన్స్ లీక్.. ఎన్టీఆర్ ఫైట్ అలా.. చరణ్ పోరాటం ఇలా!
- 1 hr ago
V movie వివాదం: అక్రమంగా సినీ నటి ఫోటో వాడకం.. అమెజాన్ ప్రైమ్‌కు హైకోర్టు షాక్
- 2 hrs ago
చమ్మక్ చంద్రను ఫోన్ నెంబర్ అడిగిన శ్రీదేవి: ఏకంగా హీరోయిన్ అంత మాట అనడంతో అంతా షాక్!
Don't Miss!
- Finance
HDFC గుడ్‌న్యూస్, హోంలోన్ వడ్డీ రేటు తగ్గింపు: SBI, కొటక్ బ్యాంకులోను...
- News
సింహాచలంలో నారా లోకేష్: మున్సిపాలిటీల్లో వైసీపీ హవాను అడ్డుకోగలరా? 8 వరకు బిజీగా
- Sports
కీరన్ పోలార్డ్ విధ్వంసం.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు! యువరాజ్, గిబ్స్ తర్వాత! వీడియో
- Lifestyle
గురువారం దినఫలాలు : ఓ రాశి వారు అధ్యయనాలపై పూర్తి దృష్టి పెట్టాలి...!
- Automobiles
మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కార్ కొనుగోలు చేసిన సినీ నటి భావన
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నాగబాబు దారిలో సునీత.. ఆ వీడియోలతో సోషల్ మీడియాలో రచ్చ
ప్రస్తుతం సెలెబ్రిటీలందరూ యూట్యూబ్‌లపై పడ్డారు. ప్రతీ ఒక్కరూ తమ కంటూ ఓ ప్రత్యేకమైన చానెల్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఆ యూట్యూబ్ చానెల్స్‌ను ప్రమోట్ చేసుకునేందుకు వెరైటీ వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇందులో నాగబాబు అయితే మొదటగా ప్రవచనాలు, సూక్తులు, మంచి మాటలు చెబుతూ కొన్నీ వీడియోలు చేశాడు. ఆ తరువాత నిహారిక పెళ్లి వీడియోలను షేర్ చేస్తూ రచ్చ చేశాడు.

వరుసగా వీడియోలు..
మెగా బ్రదర్ నాగబాబు నిహారిక పెళ్లి వీడియోలను వరుసగా పోస్ట్ చేస్తూ వచ్చాడు. సిరీస్‌లు సిరీస్‌లు ఒక్కొక్కటి బయటకు వదులుతూ వచ్చాడు. ఆ వీడియోలన్నీ కూడా యూట్యూబ్‌లో బాగానే ట్రెండ్ అయ్యాయి. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బాగానే ట్రెండ్ అయ్యాయి.

ఇప్పుడు సునీత కూడా..
నాగబాబు దారిలోనే సునీత కూడా ప్రయాణిస్తోంది. తాజాగా సునీత తన పెళ్లికి సంబంధించి టీజర్‌ను విడుదల చేసింది. ఇక టీజర్ అంటూ చెప్పడంతో ఇంకా మున్ముందు చాలా వీడియోలే రాబోతోన్నాయని చెప్పకనే చెప్పేసింది. నెక్స్ట్ ట్రైలర్ ఆ తరువాత మొత్తం సినిమా రాబోతోందన్న మాట.

వీడియోలో అలా..
సునీత రామ్ వెడ్డింగ్ ఫిల్మ్ టీజర్ అంటూ రిలీజ్ చేసిన వీడియోలో సునీత తన పిల్లలతో కలిసి ఆడుకుంటున్న మూమెంట్స్ ఉన్నాయి. నిశ్చితార్థం నాడు జరిగిన తతంగాలను ఈ వీడియోలో చూపించింది సునీత. ఆ వీడియోలో సునీత పిల్లలిద్దరూ సరదాగా పోట్లాడుకుంటున్నట్టున్నారు.
హల్దీ ఈవెంట్‌లో అలా..
పెళ్లి అంటే హల్దీ, మెహెందీ వంటీ ఈవెంట్లు ఎంత గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంటారో అందరికీ తెలిసిందే. సునీత పెళ్లిలోనూ మెహెందీ, హల్దీ ఫంక్షన్లను గ్రాండ్‌గా జరుపుకున్నారు. అయితే అన్ని ఈవెంట్లకు సంబంధించి అలా అలా లైట్‌గా చూపించేసింది. మరి మిగతా వీడియోలు ఎప్పుడు విడుదల చేస్తుందో చూడాలి.

సునీత వివాహాం..
సునీత రామ్ వివాహాం జనవరి 9న గుడిలో వివాహాం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సునీత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. దిల్ రాజు, నితిన్, సుమ, రేణూ దేశాయ్‌లు వంటి వారు మాత్రమే వచ్చారు. సోషల్ మీడియాలో సునీత రెండో వివాహాం ఎంతటి చర్చలకు దారి తీసిందో అందరికీ తెలిసిందే.