»   » వాణీ జయరామ్‌కి పి.సుశీల పురస్కారం

వాణీ జయరామ్‌కి పి.సుశీల పురస్కారం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ సినీ నేపథ్యగాయని వాణీ జయరామ్‌కి పి.సుశీల పురస్కారం లభించింది. ఏటా పి.సుశీల ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఒకరికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ఈ ఏడాది వాణీ జయరామ్‌కి ప్రదానం చేయబోతున్నట్టు ట్రస్టు ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రముఖ గాయని రావు బాలసరస్వతీదేవి అధ్యక్షతన ఏర్పాటైన జ్యూరీ ఈ పురస్కారానికి ఎంపిక చేస్తుంది. జ్యూరీలో సభ్యులుగా గాయని జమునారాణి, సంగీత దర్శకుడు కె.ఎమ్‌.రాధాకృష్ణన్‌ కొనసాగుతున్నారు.

ఈ పురస్కారం కింద గ్రహీతకి రూ.లక్ష నగదుతో పాటు, జ్ఞాపికని ప్రదానం చేస్తారు. ఈ నెల9న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో పురస్కార ప్రదానోత్సవం జరుగుతుందని కార్యక్రమ కన్వీనర్‌ సంజయ్‌కిషోర్‌ తెలిపారు. 'సంగమం' కన్వీనర్ సంజయ్‌కిషోర్ మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం ఉత్తమ గాయనీమణులుకు ప్రదానం చేస్తున్న ఈ అవార్డును ఈసారి రావు బాలసరస్వతీదేవి అధ్యక్షతన, జమునారాణి, సంగీత దర్శకుడు కె.ఎం.రాధాకృష్ణన్ సభ్యులుగా ఉన్న ఈ జ్యూరీ ఈ సంవత్సరానికి అనేక చిత్రాల్లో తన గాన మాధుర్యంతో అలరించిన వాణీజయరామ్‌ను ఎంపిక చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.పి.శైలజ, ఎల్.ఆర్. ఈశ్వరి, సునీత, ఎం.ఎం.శ్రీలేఖ, కౌసల్య వంటి గాయనీమణులచే సంగీత విభావరి నిర్వహించనున్నామని మంత్రి మండలి బుద్ధప్రసాద్, అలనాటి నటి కళాభారతి జమున, మంజుభార్గవి, తనికెళ్ల భరణి తదితరులు అతిథులుగా విచ్చేయనున్నారని, ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని ఆయన వివరించారు.

Singer Vani Jayaram got P Susheela Award

వాణీ జయరామ్‌ దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నేపథ్యగాయకురాలు. వాణీ జయరాం తమిళనాడులోని వెల్లూరులో జన్మించారు. వాణీ జయరాం వారి తల్లిదండ్రుల ఎనిమిది మంది సంతానంలో ఐదవ పుత్రిక. ఈమె తల్లి ప్రఖ్యాత వీణా విద్వాంసులు రంగ రామనుజ అయ్యంగార్‌ శిష్యురాలు. వాణి జయరాం పసిప్రాయంలోనే బాల మేధావిగా విశేష ప్రతిభ కనబర్చారు. ఎనిమిదవ ఏట నే ఆవిడ ఆల్‌ ఇండియా రేడియో పాల్గొన్నారు.

వాణి జయరాం కర్నాటక సంగీతం కడలూరు శ్రీనివాస అయ్యంగార్‌, టి.ఆర్‌, బాలసుబ్రమణియన్‌, ఆర్‌.యెస్‌ మణి ల వద్ద అభ్యసించగా, హిందుస్తాని సంగీతం ప్రఖ్యాత ఉస్తాద్‌ అబ్దుల్‌ రహ్మాన్‌ ఖాన్‌ వద్ద నేర్చుకున్నారు. వివాహానంతరం భర్తతో ముంబయ్‌లో స్థిరపడ్డ వాణి జయరాం అనుకోని విధంగా హిందీ సంగీత దర్శకుడు వసంత్‌ దేశాయ్‌ని కలవడం అలా ఆవిడ హృషీకేష్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ప్రముఖ హిందీ చలన చిత్రం గుడ్డి లోని బోలె రే పపీ హరా ద్వారా సినీనేపధ్య గాయకురాలిగా ఆరంగేట్రం చేసి తన చిన్ననాటి కలను నిజం చేసుకొన్నారు.

English summary

 P Susheela Trust which felicitates legendary musicians every year at national level with 'P Susheela Award' is given this year to legendary South Indian singer Vani Jayaram. In a press notification, Sanjay Kishore, the Program convener said that the jury comprising of singers Rao Bala Saraswathi and Jamuna Rani and Music composer Radha Krishnan has selected the versatile singer for the award.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu