»   » సింగం 123....లైట్ తీస్కోండి అంటున్న విష్ణు(ఫోటోస్)

సింగం 123....లైట్ తీస్కోండి అంటున్న విష్ణు(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సంపూర్ణేష్ బాబు హీరోగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లో రూపొందుతున్న చిత్రం ‘సింగం 123'. అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రాన్ని మంచు విష్ణు నిర్మిస్తున్నారు. శేషు కె.యం.ఆర్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల హైదరాబాద్ లో జరిగింది.

నిర్మాత మంచు విష్ణు స్వయంగా ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ సినిమా స్పూఫ్ లా ఉంటుంది. అందుకే ఈ సినిమాని కేవలం కామెడీ కోణంలోనే చూడాలని నా తోటి నటీనటులు, దర్శకులు, ఇతర నిర్మాతలను కోరుతున్నాను. కేవలం కామెడీ కోసమే కొన్ని ఇమిటేషన్స్ చేసాం. అలాంటి సీన్లను ఎవరూ మనసులో పెట్టుకోకుండా లైట్ తీసుకోవాలని కోరుతున్నాను' అన్నారు.

సినిమా ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సి ఉంది. గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాక పోవడంతో ఆలస్యమైంది. ఈ నెల 28న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. కుదరకపోతే జూన్ మొదటి వారంలో విడుదల చేస్తాం. ఈ సినిమాలో ఇరవై నుండి ముప్పై శాతం కథ ఉంటే మిగిలినదంతా కామెడీ ఉంటుంది. మీ సపోర్టు ఉంటే వచ్చే ఏడాది మే నెలలోపు ఐదు లో బడ్జెట్ సినిమాలు చేయాలనుకుంటున్నాం అని విష్ణు చెప్పుకొచ్చాడు.

స్లైడ్ షోలో ఫోటోలు..

సంపూ మాట్లాడుతూ..

సంపూ మాట్లాడుతూ..


ఇదే బేనర్లో నేను కరెంటు తీగ చిత్రంలో చిన్న రోల్ చేసాను. ఆ రోల్ చిన్నదైపోయిందని విష్ణుగారు అనుకున్నారో ఏమో ఈ సినిమాతో ఏకంగా హీరోని చేసేసారు. ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలు చేసారు. సపోర్టు చేసిన అందరికీ థాంక్స్ అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ..

దర్శకుడు మాట్లాడుతూ..


ఈ చిత్రానికి విష్ణు కేవలం నిర్మాతగానే కాకుండా...కథ, స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఇందులో డిఫరెంట్ సంపూని చూస్తారు. శేషు మంచి మ్యూజిక్ ఇచ్చారు అన్నారు.

నటీనటులు

నటీనటులు


సంపూర్ణేష్ బాబు, సనమ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో భవాని, పృథ్విరాజ్, అన్నపూర్ణ, వేణుగోపాలరావు, దాసన్న, గున నాగేంద్ర, వైవా హర్ష తదితరులు నటించారు.

తెర వెనక

తెర వెనక


ఈ చిత్రానికి ఆర్ట్: రఘు కులకర్ణి, ఫైట్స్: పి.సతీష్, సంగీతం: శేషు, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల, డైలాగ్స్: డైమండ్ రత్నం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్, కథ-స్క్రీన్ ప్లే-నిర్మాత: మంచు విష్ణు, దర్శకత్వం: అక్షత్ అజయ్ శర్మ.

English summary
Singham 123 Audio Launch event held at Prasad Labs, Hyderabad.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu