»   » షాకింగ్: ‘సింగం-123’ రిలీజ్ రోజే ఆన్‌లైన్లో

షాకింగ్: ‘సింగం-123’ రిలీజ్ రోజే ఆన్‌లైన్లో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు త్వరలో ‘సింగం 123' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. జూన్ 5న ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అక్షత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బేనర్లో మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది.

ఈ సినిమాను జూన్ 5న థియేటర్లతో పాటు.... అదే రోజు ఆన్ లైన్లో విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత మంచు విష్ణు వెల్లడించారు.


Singham 123 online release on same day

ఈచిత్రాన్ని మంచు విష్ణు నిర్మిస్తుండటంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ చిత్రానికి పబ్లిసిటీ ఓ రేంజిలో చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. నాలుక మడతెట్టి సంపూర్ణేష్ బాబు ఫోటోలకు పవర్ ఫుల్ ఆటిట్యూడ్ తో ఇచ్చిన ఫోజులు ఆకట్టుకుంటున్నాయి.


దర్శకుడు మాట్లాడుతూ.... సంపూర్ణేష్‌బాబు నుంచి ప్రేక్షకులు ఏ తరహా వినోదాన్ని కోరుకుంటున్నారో అది ఈ సినిమాలో వంద శాతం వుంటుంది. కథకు తగ్గ హీరో కుదిరారు. ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించనున్నాం అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ నేటి వాస్తవ పరిస్థితులని ప్రతిభింబిస్తూ..నేటి యువతరాన్ని ఉత్తేజపరుస్తూ ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుంది అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల, ఎడిటర్: యం.ఆర్.వర్మ, మ్యూజిక్: శేషు, డైలాగ్స్: డైమండ్ రత్నం, ఆర్ట్: రఘు కులకర్ణి, కథ-స్క్రీన్ ప్లే-నిర్మాత: విష్ణు మంచు, దర్శకత్వం: అక్షత్ అజయ్ శర్మ.

English summary
Singham 123, which is releasing on next Friday 5th June, will be released directly online too. “Going to do a new pathbreaking distribution for Singham 123. We’re going to release this movie online same day. Except India it will be release everywhere in pay per view model”, said Vishnu today.
Please Wait while comments are loading...