»   » సంపూ కాదు సింహం.... ‘సింగం 123’ (ట్రైలర్)

సంపూ కాదు సింహం.... ‘సింగం 123’ (ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘హృదయ కాలేయం' సినిమాతో ఊహించని విధంగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకన్న సంపూర్ణేష్ బాబు త్వరలో ‘సింగం 123' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతన్నారు. ఈచిత్రాన్ని మంచు విష్ణు నిర్మిస్తుండటంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసారు. ఈ నెల చివర్లోగానీ, జూన్ మొదటి వారంలోగానీ సినిమాను విడుదల చేస్తామని నిర్మాత మంచు విష్ణు తెలిపారు.


ఈ చిత్రానికి పబ్లిసిటీ ఓ రేంజిలో చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. నాలుక మడతెట్టి సంపూర్ణేష్ బాబు ఫోటోలకు పవర్ ఫుల్ ఆటిట్యూడ్ తో ఇచ్చిన ఫోజులు ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే... పైకి పవర్ ఫుల్ గా కనిపించే ఈ కామెడీ ఎంటర్టెనర్ చూడాలని కోరిక కలుగుతుంది.


మోహన్ బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా మంచు విష్ణు నిర్మిస్తోన్న ఈ చిత్రంలోసంపూర్ణేష్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైంది. ఆడియో కూడా విడుదల చేసారు.


SINGHAM 123 TRAILER

దర్శకుడు మాట్లాడుతూ.... సంపూర్ణేష్‌బాబు నుంచి ప్రేక్షకులు ఏ తరహా వినోదాన్ని కోరుకుంటున్నారో అది ఈ సినిమాలో వంద శాతం వుంటుంది. కథకు తగ్గ హీరో కుదిరారు. ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించనున్నాం అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ నేటి వాస్తవ పరిస్థితులని ప్రతిభింబిస్తూ..నేటి యువతరాన్ని ఉత్తేజపరుస్తూ ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుంది అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల, ఎడిటర్: యం.ఆర్.వర్మ, మ్యూజిక్: శేషు, డైలాగ్స్: డైమండ్ రత్నం, ఆర్ట్: రఘు కులకర్ణి, కథ-స్క్రీన్ ప్లే-నిర్మాత: విష్ణు మంచు, దర్శకత్వం: అక్షత్ అజయ్ శర్మ.

English summary
Singham 123 is a spoof action comedy starring Sampoornesh Babu playing the role of a “Sensational”, “Seductive”, “Supercop”.
Please Wait while comments are loading...