»   » రేపు అంతా సంపూర్ణేష్ బాబు టాపిక్కే

రేపు అంతా సంపూర్ణేష్ బాబు టాపిక్కే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు త్వరలో ‘సింగం 123' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేసి అందరిని తన వైపు తిప్పుకున్న యూనిట్ ..రేపు అంటే ఏప్రియల్ 8న చిత్రం థియోటర్ ట్రైలర్ ని విడుదల చేసి హాట్ టాపిక్ గా మారనుంది. ఈ ట్రైలర్ చాలా ఫన్నిగా ఉండి... సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఓ రేంజిలో క్రేజ్ సంపాదిస్తుందని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ చిత్రాన్ని మంచు విష్ణు నిర్మిస్తుండటంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. మే 15 న చిత్రం విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి కూడా పబ్లిసిటీ వెరైటీగా చేస్తున్నారు. నాలుక మడతెట్టి సంపూర్ణేష్ బాబు ఫోటోలకు పవర్ ఫుల్ ఆటిట్యూడ్ తో ఇచ్చిన ఫోజులు ఆకట్టుకుంటున్నాయి.


Singham 123 trailer release date locked

మోహన్ బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా మంచు విష్ణు నిర్మిస్తోన్న ఈ చిత్రంలోసంపూర్ణేష్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను ఏప్రిల్ 8న విడుదల చేస్తున్నారు.


దర్శకుడు మాట్లాడుతూ.... సంపూర్ణేష్‌బాబు నుంచి ప్రేక్షకులు ఏ తరహా వినోదాన్ని కోరుకుంటున్నారో అది ఈ సినిమాలో వంద శాతం వుంటుంది. కథకు తగ్గ హీరో కుదిరారు. ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించనున్నాం అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ నేటి వాస్తవ పరిస్థితులని ప్రతిభింబిస్తూ..నేటి యువతరాన్ని ఉత్తేజపరుస్తూ ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుంది అన్నారు.


ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల, ఎడిటర్: యం.ఆర్.వర్మ, మ్యూజిక్: శేషు, డైలాగ్స్: డైమండ్ రత్నం, ఆర్ట్: రఘు కులకర్ణి, కథ-స్క్రీన్ ప్లే-నిర్మాత: విష్ణు మంచు, దర్శకత్వం: అక్షత్ అజయ్ శర్మ.

English summary
Sampoornesh Babu’s forthcoming film ‘Singham 123’ film’s theatrical trailer will be released on April 08.
Please Wait while comments are loading...