పక్కా ప్లానింగ్ తోనే పవన్ కళ్యాణ్ సింక్ సౌండ్ టెక్నాలజికి రెడీ...
ప్రస్తుతం పవన్ కళ్యాణ్, త్రిష జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'ఖుషిగా" ఈ చిత్రానికి జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహిస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. 'లవ్ అజ్ కల్' రీమేక్ 'ఖుషిగా" కు సింక్ సౌండ్ టెక్నాలజీనీ ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు. సింక్ సౌండ్ టెక్నిక్ అంటే షూటింగ్ సమయంలోనే నటీనటుల డైలాగులను రికార్డ్ చేస్తారు. ఇక డబ్బింగ్ చెప్పవలసిన అవసరం ఉండదు. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే సింక్ సౌండ్ టెక్నిక్ ను మొదట తెలుగు సినిమాలో ఉపయోగించింది పవన్ కళ్యాణే అదీ తను దర్శకత్వం వహించిన జానీ సినిమాకోసం.
హాలీవుడ్ మరియు బాలీవుడ్ సినిమాలలో సింక్ సౌండ్ టెక్నిక్ ను తరచుగా వాడుతూ ఉంటారు. తెలుగు సినిమాలలో చాలా తక్కువ. అంతే కాకుండా ఈ టెక్నాలజీ నీ వాడటానికి ఏకాగ్రత మరియు పక్కా ప్లానింగ్ ఉండాలి. పవన్ కష్టతరమైన ఈ సింక్ సౌండ్ టెక్నిక్ ను ఉపయోగించి ఎంతవరకు విజయం సాదిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











