దర్శకడు కృష్ణవంశీ నన్ను రాసిరంపాన పెట్టాడు...?
గోపీచంద్ కథానాయకుడిగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మొగుడు". లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు బుజ్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్షికమం మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని రాక్‌గ్డాన్స్‌లో జరిగిన విషయం విధితమే.. మేళతాళాల మంగళవాద్యాల నడుమ తెలుగువారి పెళ్లి సందడిలా సాగిన ఈ కార్యక్రమంలో ఎన్.టి.ఆర్, సీతారామశాస్ర్తి, రామజోగయ్యశాస్ర్తి, సురేష్‌బాబు, శానం నాగ అశోక్, కొడాలి నాని, వల్లభనేని వంశీ, బూరుగుపల్లి శివరామకృష్ణ, సురేందర్‌రెడ్డి, డా.కె.ఎల్.నారాయణ, రాజేం ద్రప్రసాద్, వి.వి.వినాయక్, బోయపాటి శ్రీను, దిల్‌రాజు, అల్లు అరవింద్, సి.కళ్యాణ్, తదితరులు ముఖ్య అథిధులుగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో పలువురు ఈ సినిమా సక్సెస్ అవుతుందని వ్యాక్యానించారు.
ఈ సందర్భంగా గీత రచయిత సీతారామ శాస్త్రి మాట్లాడుతూ..కృష్ణవంశీ అంటే పక్షపాతమా అని చాలామంది అంటుంటారు. ఆయనకు మంచి పాటలు రాస్తారు అని. అయితే అందరికీ రాసినట్లే ఆయనకు రాశాను. అయితే వంశీ నన్ను రాసిరంపాన పెట్టి మరీ రాయించారు'' అని సీతారామశాస్త్రి 'మొగుడు' చిత్రంలోని భార్య భర్తల గురించి పాట రాయడానికి గల నేపథ్యాన్ని వివరించారు. ఈ పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. పాటల గురించి ఆయన వివరిస్తూ.. 'పెళ్లి భారతీయ సంస్కృతిలో మహోన్నతమైన విషయం. కుటంబమనే మహా సౌధానికి పునాది లాంటిది. ఇలాంటి సంప్రదాయం మనదేశంలో తప్ప ఎక్కడా కన్పించదు. ఒకభార్య తన భర్తనుంచి ఏమి కావాలో అది సూటిగా అడుగుతుంది. ఆ పాటను నేను రాశాను. ఈ రెండు పాటలు పరీక్షపెట్టాయి. బాబు శంకర్ ఎంతో పేరుపొదిన యాడ్‌మేకర్. అలాంటి వ్యక్తి బాణీలు చేయడం విశేషం అని తెలిపారు.


Click it and Unblock the Notifications











