»   » మహేష్ బాబు కూతురు సితార లుక్ అదిరింది (ఫోటో)

మహేష్ బాబు కూతురు సితార లుక్ అదిరింది (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు, నమ్రత దంపతుల ముద్దుల కూతురు సితార.... గగ్రా చోళీ డ్రెస్ లో అదిరిపోయే లుక్ లో దర్శనమిచ్చింది. సరికొత్త లుక్ లో సితార నవ్వులు చిందిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మూడున్నరేళ్ల ఈ చిన్నారి ఇపుడు మహేష్ బాబు అభిమానులకు హాట్ ఫేవరెట్.

Sitara Ghagra Choli look

మహేష్ బాబు తనయుడు గౌతం కృష్ణ ఇప్పటికే ‘1 నేనొక్కడినే' సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. తొలి సినిమాలో గౌతం తన యాక్టింగ్ స్కిల్స్ తో ఆకట్టుకున్నాడు. 9 ఏళ్ల వయసులో అబ్బుర పరిచే నటన కనబర్చిన గౌతం మా టీవీ అవార్డు కూడా అందుకున్నాడు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు కూతురు ‘సితార' కూడా త్వరలో వెండి తెరకు పరిచయం కాబోతున్నట్లు సమాచారం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం'లో సితార ఓ చిన్న పాత్రలో కనిపించనుందట. మహేష్ బాబు కూడా చిన్న వయసులోనే తన తండ్రి నటించిన చిత్రాల్లో నటిస్తూ వెండి తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే.

ఇటీవల మాటీవీ అవార్డుల పంక్షన్లో తన ఫ్యామిలీతో కలిసి హాజరై అందరినీ ఆకట్టుకుంది. బ్రహ్మోత్సవం సినిమా ద్వారా సితారను వెండి తెరపై చూడటం అంటే అభిమానులకు పండగ అనే చెప్పాలి. అయితే సితార నటించే విషయం ఇంకా అఫీషియల్ గా ఖరారు కాలేదు. త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

English summary
Mahesh Babu and Namrata Shirodkar's doting daughter Sitara has stunned one and all in a traditional outfit. Sporting a dazzling pink Ghagra Choli, Sitara sizzled.
Please Wait while comments are loading...