Just In
Don't Miss!
- News
'డ్యాన్స్'పై ఆసక్తి.. ఊహించని మలుపులు తిరిగిన జీవితం.. లింగ మార్పిడి,మూడేళ్లుగా గ్యాంగ్ రేప్...
- Sports
పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లీనే అత్యుత్తమం.. జడేజా కూడా: శ్రీలంక పేసర్
- Finance
4 వారాల్లో అతిపెద్ద పతనం, ఇన్వెస్ట్ చేస్తున్నారా.. కాస్త జాగ్రత్త!
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ విషయంలో నాన్న ఎంకరేజ్ చేయరు.. మహేష్ గురించి కూతురు సితార ఘట్టమనేని
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురిగా పరిచమయమైన సితార ఘట్టమనేని చిన్నతనంలోనే తన ఆటపాటలతో అద్భుతంగా రాణిస్తున్నారు. తాను చేసే వీడియోలతో మీడియాను విశేషంగా ఆకర్షిస్తున్నారు. కొత్త సంవత్సరం రోజున సితార ప్రముఖ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ...

నాన్న మాత్రమే నాకు ఫేవరేట్
నాకు నాన్న మాత్రమే ఫేవరేట్ హీరో. నాన్న సినిమాలు తప్ప మరో సినిమాలు పెద్దగా చూడను. వేరే హీరోలు గురించి పెద్దగా తెలియదు. అయితే నాన్నను యాక్టింగ్ గురించి చెప్పరు. నాకు యాక్టింగ్ నేర్పించమంటే నేర్పించరు. పెద్దైన తర్వాత నేను సినీ తారను కావాలనుకొంటున్నాను అని సితార అన్నారు.

గౌతమ్‌తో కలిసి నటించాలని
నా సోదరుడు గౌతమ్‌తో కలిసి నటించాలని ఉంది. కానీ ఆ కోరిక ఎప్పుడూ తీరుతుందో తెలియదు. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ఇప్పటికే గౌతమ్ నాన్నతో కలిసి నటించాడు. నాకు కూడా నాన్నతో కలిసి నటించాలని ఉంది అంటూ సితార చెప్పారు.

రష్మిక అంటే నాకు ఇష్టం
ఇక నాకు నచ్చిన హీరోయిన్ రష్మిక మందన్న. ఆమె ఫన్నీగా ఉంటుంది. నాతో చాలా చనువుగా ఉంటుంది. రష్మిక అంటే నాకు చాలా ఇష్టం. ఆమెతో టైమ్ చాలా గడిచిపోతుంది. నాతో చాలా చక్కగా మాట్లాడుతుంది. కాబట్టి ఆమె అంటే నాకు ఇష్టం ఏర్పడింది అంటూ సితార చెప్పింది.

దేవుడికి థ్యాంక్స్ చెప్పుకొంటా
నాకు మహేష్ బాబు, నమ్రత, గౌతమ్ లాంటి కుటుంబం ఉండటం గొప్ప అదృష్టంగా భావిస్తాను. అందుకు నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పుకొంటాను. నాకు ఇంత గుర్తింపు వచ్చిందంటే వారి వల్లే అని సితార చెప్పారు. నేను ఎక్కువగా నాన్నతో టైమ్ స్పెండ్ చేస్తుంటాను. షూటింగు ఉంటే అమ్మతో ఎక్కువగా ఉంటాను అని సితార చెప్పారు.