»   » దిల్ రాజు 'రెమో' ట్రైలర్ ఇదిగో (వీడియో), చూస్తే రిలీజ్ ఎప్పుడుని అడుగుతారు

దిల్ రాజు 'రెమో' ట్రైలర్ ఇదిగో (వీడియో), చూస్తే రిలీజ్ ఎప్పుడుని అడుగుతారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :స్ట్రయిట్ తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాల మీద కూడా దృష్టి పెట్టిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు, మరో తమిళ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందు తీసుకురానున్నాడని తెలియగానే ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి మొదలైంది. ఓకె బంగారం సినిమాను తెలుగులో రిలీజ్ చేసి ఘనవిజయం సాధించిన రాజు, ఈ సారి ఓ కామెడీ ఎంటర్ టైనర్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు. ఈ నేపధ్యంలో చిత్రం ట్రైలర్ ని విడదల చేసారు. ఆ ట్రైలర్ కి మంచి అప్లాజ్ వస్తోంది. మీరు ఇక్కడ చూడవచ్చు.

తమిళనాట వరస సక్సెస్ లతో దూసుకుపోతున్న యంగ్ హీరో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ ఎంటర్ టైనర్ రెమో. హీరో లేడి నర్స్ గెటప్ లో కనిపిస్తున్న ఈ సినిమా తమిళంలో రిలీజ్ అయ్యిం...భాక్సాపీస్ వద్ద బాగానే వర్కవుట్ అయ్యింది. దీంతో ఈ సినిమాను తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


Photos: రెమో తెలుగు ఆడియో లాంచ్


నేను శైలజ సినిమాతో తెలుగులో సూపర్ హిట్ సాధించిన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో.. గతంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా తెరకెక్కిన మేడం సినిమా ఛాయలు కనిపిస్తున్నాయనే విమర్శలు వినపడుతున్నా...సినిమా పూర్తి కామెడీతో నవ్వించనుందంటున్నారు. దీంతో రెమో కూడా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు దిల్ రాజు. తెలుగులో కూడా రెమో పేరుతోనే రిలీజ్ కానున్న ఈ సినిమా విడుదల తేదీ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.దిల్ రాజు మాట్లాడుతూ - "నేను నిర్మాత‌గా నా బ్యాన‌ర్‌లో 25 సినిమా చేస్తున్నాను. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాను రీమేక్ చేయ‌లేదు. తొలిసారి రెమో ట్రైల‌ర్ చూసి సినిమాను రీమేక్ చేయాల‌నిపించేంత‌గా ఇన్‌స్పైర్ అయ్యాను. త‌మిళంలో ఈ సినిమాను నేను ఒక్క‌డినే ప్రివ్యూ షో వేసుకుని చూసిన‌ప్పుడు బాగా ఎంజాయ్ చేశాను, భాష తెలియ‌దు క‌దా, కాబ‌ట్టి నాకు ఎక్క‌డో డౌట్ వ‌చ్చింది, దాని వ‌ల్ల వెట్రి థియేట‌ర్‌లో ఆడియెన్స్ మ‌ధ్య సినిమా చూశాను. ఆడియెన్స్ కూడా సినిమాను బాగా ఎంజాయ్ చేయ‌డం చూసి నాలో నమ్మ‌కం ఏర్ప‌డిందని అన్నారు.. ఈ మూవీ త్వ‌ర‌లో విడుద‌ల కానుంది..


శివకార్తికేయన్ మాట్లాడుతూ...తన సినిమాను అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నించారని, ఎవరు తన సినిమాను విడుదల కాకుండా చేయాలనుకున్నారో తెలుసని, తన పని తాను చేసుకుంటూంటే ఎందుకిలా చేస్తారని ప్రశ్నిస్తూ శివ కార్తికేయన్ కన్నీళ్ళు పెట్టుకున్నారు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఆర్.డీ.రాజా నిర్మించారు.


రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహించారు. 24ఎఎం స్టూడియోస్ బేనర్లో ఆర్.డి రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళనాట దసరా కానుకగా గత వారమే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.


శివకార్తికేయన్ ఓ గమ్మత్తైన స్త్రీ తరహా పాత్రలో కనిపించడంతో భారీ క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబడుతోంది.ఈ నేపథ్యంలోనే నిన్న చెన్నైలో టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది.

English summary
Remo is a romantic comedy film written and directed by Bakkiyaraj Kannan. Anirudh Ravichander has composed the songs of the film. The music of the Tamil version was released on September 5 and the album has become a hit with the audience. The movie was released as a Dusshera treat on October 7 and turned out to be super-hit at the box office.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu