»   »  ఇంట్రస్టింగ్: సాఫ్ట్వేర్ లుక్ కానీ చేతిలో రక్తంతో కత్తి, ఫస్ట్ లుక్

ఇంట్రస్టింగ్: సాఫ్ట్వేర్ లుక్ కానీ చేతిలో రక్తంతో కత్తి, ఫస్ట్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో రామ్ చరణ్ చేసిన ధృవకు మాతృక అయిన తని ఒరువన్ తో.. భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు మోహన్ రాజా. గతంలో రీమేక్ మూవీస్ చేయిన ఈయన.. ఇప్పుడు సొంత కథలతోనే ఆకట్టుకుంటున్నాడు. శివకార్తికేయన్ తో వేలైక్కారన్ చేస్తున్నాడు మోహన్ రాజా. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం.

ఆగస్ట్ 25న విడుదల

ఆగస్ట్ 25న విడుదల

చిత్రం ఇప్పటికే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొని వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ 25న విడుదల కానుంది. ఇక మణిరత్నం దర్శకత్వంలో కార్తీ, అదితి రావు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కాట్రు వేళయిదై చిత్రం ఆగస్ట్ 7 రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. వేలైక్కారన్ అంటే సర్వెంట్ అని అర్ధం.

శివకార్తికేయన్

శివకార్తికేయన్

చక్కగా ఫార్మల్స్ వేసుకుని.. నీటుగా ఇన్ షర్ట్ చేసుకుని.. చేతిలో ల్యాప్ టాప్ బ్యాక్ పట్టుకుని.. మెడలో ఐడెంటిటీ కార్డ్ వేసుకున్న శివకార్తికేయన్ పోస్టర్ ను ఫస్ట్ లుక్ గా ఇచ్చారు. అయితే.. షర్ట్ మీద కనిపిస్తున్న ఎర్రటి రక్తం.. ఎడమ చేతిలో నెత్తురోడుతున్న కత్తిని చూస్తే మాత్రం.. దర్శకుడు ఇంకేదో చెప్పాలని అనుకుంటున్నాడని అర్ధమవుతుంది.

టీవీ యాంకర్ నుంచి స్టార్ హీరో

టీవీ యాంకర్ నుంచి స్టార్ హీరో

హీరోకు ఒకవైపు పోష్ లొకాలిటీ.. మరోవైవు కనిపిస్తున్న గుడిసెలు చూస్తుంటే.. పేద గొప్ప అంతరాన్ని పాయింట్ ను తీసుకున్నాడని అర్ధం చేసుకోవచ్చు.టీవీ యాంకర్ నుంచి స్టార్ హీరో ఇమేజ్ వరకు ఎదిగిన కోలీవుడ్ కుర్రాడు శివ కార్తికేయన్. రెమో అంటూ గతేడాది టాలీవుడ్ జనాలను కూడా ఆకట్టుకునేందుకు ప్రయత్నించాడు కానీ అంతగా సక్సెస్ కాలేకపోయాడు.

ఆసక్తి కలిగిస్తోంది

ఆసక్తి కలిగిస్తోంది

ఇప్పుడీ హీరో కొత్త సినిమా ఆసక్తి కలిగిస్తోంది. తాజాగా వెలైక్కారన్ ఫస్ట్ లుక్ ను ఇచ్చాడు శివకార్తికేయన్. మొత్తానికి ఈ హీరో చేసిన రెమో సరైన హిట్ ని ఇవ్వక పోయినా ఈ వెలైక్కారన్ మాత్రం న్యాయం చేసేటట్టే ఉన్నాడు. రెమో వచ్చినట్టే ఈ సినిమా కూడా తెలుగు లోకి వచ్చే అవకాశం ఉందేమో చూడాలి.

English summary
The first look poster of Sivakarthikeyan’s Velaikkaran was unveiled yesterday on Twitter by the film’s director, Mohan Raja.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu