»   » లారెన్స్ శివ‌లింగ టీజ‌ర్ తెలుగులో...

లారెన్స్ శివ‌లింగ టీజ‌ర్ తెలుగులో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొరియోగ్రాప‌ర్‌, డైరెక్ట‌ర్, హీరోగా త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ హీరోగా పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో భారీ బడ్జెట్ తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై శివలింగ ను తెరకెక్కిస్తున్న చిత్రం శివ‌లింగ‌.రితిక హీరోయిన్‌గా న‌టిస్తుంది. క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ శివ‌రాజ్‌కుమార్ న‌టించిన క‌న్న‌డ సూప‌ర్‌హిట్ మూవీ శివ‌లింగ రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.

తమిళంలో ఆల్రెడీ ఈ టీజర్ రిలీజైంది. తెలుగులో జ‌న‌వ‌రి 23న ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్నారు. ప్రస్తుతానికి తమిళ టీజర్ పై ఓ లుక్కేద్దాం.

ఈ సంద‌ర్భంగా....ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ- కథే హీరోగా కన్నడ లో బ్లాక్ బస్టర్ అయిన చిత్రం 'శివలింగ '. పి.వాసు గారి చంద్రముఖి, లారెన్స్ కాంచన , గంగ చిత్రాలను మించిన కథ, కథనాలతో హార్రర్ ఎంటర్ టైనర్ గా శివలింగ తెరకెక్కుతోంది.చిత్రీకరణ పూర్తయింది.నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా టీజ‌ర్‌ను జ‌న‌వ‌రి 23 న విడుద‌ల చేస్తున్నాం. అలాగే సినిమాను ఫిబ్రవరి లో విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. హార్రర్ కాన్సెప్ట్ ల పరంగా శివలింగ నెక్ట్స్ లెవెల్ లొ ఉండే చిత్రమని అన్నారు.

రాఘ‌వ‌లారెన్స్‌, రితిక సింగ్‌, వ‌డివేలు, శ‌క్తివాసు, రాధార‌వి, జ‌య‌ప్ర‌కాష్‌, ప్ర‌దీప్ రావ‌త్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః స‌ర్వేష్ మురారి. మ్యూజిక్ః ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌, సాహిత్యంః రామ‌జోగ‌య్య శాస్త్రి, ఆర్ట్ః దురైరాజ్‌, ఫైట్స్ః అన‌ల్ అర‌సు, దినేష్‌, ఎడిటింగ్ః సురేష్‌, నిర్మాతః ర‌మేష్‌.పి.పిళ్లై.

English summary
Raghava Lawrence upcoming film 'Sivalinga' is getting ready to release it's first look teaser on 23rd January. It's a Tamil, Telugu Horror flick directed by P. Vasu. Ritika Singh is playing the female lead and Director P vasu's son Sakti Vasu is doing very crucial role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu