Just In
Don't Miss!
- Finance
సెబి షాకింగ్: HDFCకి భారీ జరిమానా, షేర్లు పతనం
- Automobiles
ఆటో డ్రైవర్ కొడుకు ఇప్పుడు 'బీమర్' ఓనర్ అయ్యాడు; సిరాజ్ కొత్త కార్ చూడండి
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- News
కేటీఆర్ సీఎం అయితే అణుబాంబు పేలుతుంది : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
- Sports
Syed Mushtaq Ali Trophy 2021: నాకౌట్ షెడ్యూల్ ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొరటాల ఈ సినిమాలు చేసారని మీకు తెలియదేమో, కొత్తగా కమిటైనవి కూడా
హైదరాబాద్: ప్రభాస్ తో చేసిన 'మిర్చి', మహేష్ తో చేసిన 'శ్రీమంతుడు'...రెండే రెండు సినిమాలతో తెలుగులో టాప్ డైరక్టర్స్ లిస్ట్ లోకి చేరిపోయిన దర్శకుడు కొరటాల శివ. మూడో సినిమాని మరింత ప్రతిష్టాత్మకంగా... ఎన్టీఆర్‌తో 'జనతా గ్యారెజ్' టైటిల్ తో ఓ చిత్రం చేస్తోన్న విషయం తెలిసిందే.
ఈ రోజు ఆయన పుట్టిన రోజు (జూన్ 15). ఈ సందర్బంగా కొరటాల శివ..సినీ ప్రస్దానంలో తొలి రోజుల్లో అంటే రచయితగా పనిచేసిన సినిమాలు గుర్తు చేసుకుందాం. వాటిలో కొన్ని మనకు తెలియనవి కూడా ఉండే అవకాసం ఉంది. వాటిని మీకు క్రింద స్లైడ్ షోలో అందిస్తున్నాం. అలాగే ఈ పుట్టిన రోజు సందర్బంగా ఆయన తదుపరి చిత్రాలు ప్రకటనలు సైతం వచ్చాయి. వాటిని ఇక్కడ మీకు అందిస్తున్నాం.
Wishing @sivakoratala garu a Blockbuster year ahead! pic.twitter.com/Qw2LC8O1CX
— Mythri Movie Makers (@MythriOfficial) June 14, 2016
ప్రస్తుతం ఎన్టీఆర్‌తో చేస్తున్న 'జనతా గ్యారెజ్' ఆగష్టు 12న విడుదల కానున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల కాకముందే కొరటాలని హాట్ కేకులా, నిర్మాతలు వరసపెట్టి ఆయనతో ఎగ్రిమెంట్ చేసుకుంటున్నారు. ఆయనతో తదుపరి నిర్మాతలు, రెండు సినిమాలను లైన్లో పెట్టడాన్ని చెప్పుకోవాలి. ఎవరా నిర్మాతలు, హీరోలు ఎవరు. స్లైడ్ షో చివర్లో ఆ వివరాలు ఇచ్చాం.

గర్ల్ ప్రెండ్
జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన గర్ల్ ప్రెండ్ చిత్రానికి కథ,మాటలు అందించారు. ఈ సినిమాకు కొరటాల పనిచేసారని చాలా మందికి తెలియదు. అందలో రవి-శివ అని టైటిల్ కార్డ్ లో పడుతుంది.

సింహా
బాలయ్య కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సింహా చిత్రానికి కొరటాల శివ..ఘోస్ట్ రైటర్ గా పనిచేసారని వికీపీడియాలో సైతం ఉంటుంది.

భధ్ర
2005 లో బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన భద్ర సినిమాకు రచయితగా పని చేసి మంచి పేరు సంపాదించాడు.

మున్నా
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన మున్నా చిత్రంతో డైలాగ్ రైటర్ గా ఫేమస్ అయ్యారు.

బృందావనం
ఎన్టీఆర్ తొలిసారిగా బృందావనం చిత్రానికి పనిచేసారు. ఈ చిత్రానికి సైతం వంశీ పైడిపల్లి డైరక్టర్. స్టోరీ,డైలాగులు కొరటాల శివ వే.

ఊసరవెల్లి
సురేంద్రరెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఊసరవెల్లి చిత్రానికి డైలాగు రైటర్ గా కొరటాల పనిచేసారు.

దర్శకుడిగా...
డైరక్టర్ గా తొలి సినిమా ‘మిర్చి' సూపర్ హిట్ కావడంతో కొరటాల వెనుదిరిగి చూసుకోవాల్సిన పని లేకపోయింది.

మహేష్ తో
మహేష్ తో ‘శ్రీమంతుడు' తీయటం, అది పెద్ద హిట్టవటంతో కొరటాల పెద్ద డైరెక్టర్ల జాబితాలోకి చేరిపోయారు.

నిర్మాత దానయ్యతో..
కొరటాల శివ పుట్టినరోజు ను పురస్కరించుకొని నిర్మాత దానయ్య ఓ ప్రాజెక్టును ప్రకటించారు. రామ్ చరణ్ కానీ అఖిల్ కానీ హీరో అయ్యే అవకాసం ఉందని సమాచారం.

మరోటి
పుట్టినరోజు ను పురస్కరించుకొని మరో సినిమా అధికారికంగా ప్రకటించబడింది. సినిమా పంపిణీ రంగంలో మంచి పేరున్న మిక్కిలినేని సుధాకర్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై నిర్మించనున్న మొదటి సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు.

ప్రస్తుతం
ఎన్టీఆర్ తో చేస్తున్న ‘జనతా గ్యారెజ్' తర్వాత కొరటాల, మొదట దానయ్య బ్యానర్‌లో సినిమా చేస్తారు. ఆ తర్వాత ఐదో సినిమా యువసుధ ఆర్ట్స్‌పై తెరకెక్కనుంది.

పుట్టిన రోజు విషెష్
వరుస సినిమాలతో దూసుకుపోతూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంటోన్న కొరటాల శివకు వన్ ఇండియా తెలుగు తెలుగు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.