»   » సూపర్ హాట్: అనుష్క ‘సైజ్ సెక్సీ’ వీడియో టీజర్

సూపర్ హాట్: అనుష్క ‘సైజ్ సెక్సీ’ వీడియో టీజర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ అనుష్క నటించిన ‘సైజ్ జీరో' మూవీ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో కేవలం లావుగా కనిపించడమే కాదు.... ‘సైజ్ సెక్సీ' అంటూ సాగే సాంగులో యమ హాటుగా కనిపించబోతోంది. తాజాగా విడుదలైన ఈ సాంగ్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది.

సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ నిర్మించిన భారీ చిత్రం ‘సైజ్ జీరో'. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు . ‘బాహుబలి', ‘రుద్రమదేవి' వంటి విలక్షణమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన స్టార్ హీరోయిన్ అనుష్క మరో విలక్షణమైన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది.

‘ఇంజి ఇడుపళగి' అనే పేరుతో ఈ చిత్రం తమిళంలో కూడా నవంబర్ 27నే విడుదల కానుంది. ఈ చిత్రం వెయిట్ లాస్ కి సంబంధించిన కాన్సెప్ట్ తో తెరకెక్కింది. దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి విన్నూతమైన సబ్జెక్ట్ తో కమర్షియల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ‘సైజ్ జీరో' సినిమా ప్రారంభం నుండి ప్రేక్షకుల్లో, సినీ అభిమానుల్లో భారీ క్రేజ్ ను క్రియేట్ చేసింది.

Size Sexy Video Teaser

ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి అందించిన ఆడియో, ట్రైలర్ నవంబర్ 1న విడుదలయ్యాయి. ఆడియో, ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం యూ ట్యూబ్ లో 1 మిలియన్ వ్యూస్ ను సంపాదించుకుని ట్రెండ్ క్రియేట్ చేసింది. రేపు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న అనుష్కకు ఇది చాలా ఆనందాన్ని కలిగించే విషయం.

అనుష్క, ఆర్య, భరత్, ఊర్వశి, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్ తదితరలు ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిరవ్ షా, ఆర్ట్: ఆనంద్ సాయి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కాస్ట్యూమ్స్: ప్రశాంత్, కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి,దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి.

English summary
Presenting To You 'Size Sexy' Video Teaser From Movie Size Zero, Music Composed By M.M Keeravaani, Starring Arya, Anushka Shetty, Sonal Chauhan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu