For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అనుష్క కనెక్ట్ అయింది: రాజమౌళికి అర్థంకాలేదు (సైజ్ జీరో ఆడియో)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: అనుష్క, ఆర్య ప్రధాన పాత్రధారులుగా ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం ‘సైజ్‌ జీరో'. ప్రకాష్‌ కోవెలమూడి దర్శకుడు. వెయిట్ లాసింగ్ అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని సందేశాత్మకంగా తెరకెక్కించారు. దర్శకుడి భార్య, రచయిత కణిక ఈ సినిమాకు స్క్రిప్టు అందించారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో నిర్వహించారు.

  సినిమా కాన్సెప్టుకు తగిన విధంగానే ఆడియో వేడుకను ప్లాన్ చేసారు. వేడుకకు వచ్చిన అతిథులు వెయిట్ మిషన్ పై నిలబడి వెయిట్ చూసుకుని, ఎక్సర్ సైజ్ సైకిల్ ను తొక్కి పాటలను విడుదల చేశారు. కార్య్రకమానికి అతిథులుగా కె.రాఘవేంద్రరావు, రాజమౌళి, శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి, దిల్‌రాజు, రానా, గుణ్ణం గంగరాజు, బి.గోపాల్‌, వంశీపైడిపల్లి, గోపీచంద్‌ మలినేని, దశరథ్‌, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ లతో పాటు యూనిట్ సభ్యులు అనుష్క, ఆర్య, అలీ, సోనాల్ చౌహాన్, నిరవ్ షా, కణిక, ప్రకాష్ కోవెలమూడి, పరమ్ వి.పొట్లూరి తదితరులు హాజరయ్యారు.

  ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ...బాహుబలి సినిమా షూటింగ్ టైంలో ఓ రోజు అనుష్క ఈ సబ్జెక్ట్ ను నెరేట్‌ చేసింది. తను ఎగ్జయిటింగ్‌తో చెప్పిన పాయింట్‌ అప్పుడు నాకు సరిగా అర్థం కాలేదు కానీ తను మంచి సినిమా చేస్తున్నానని ఎగ్జయిట్ అవుతుందని అర్థమైంది. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ట్రైలర్ తోసినిమా చూడాలనే ఎగ్జయిట్‌మెంట్‌ కలిగించారు. ప్రసాద్ పొట్లూరి గారు మంచి ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ తో సినిమాను నిర్మించారు. అలాగే ప్రకాష్‌ కోవెలమూడి ఏ సినిమా చేసినా సిన్సియర్‌గా నమ్మి చేస్తాడు. కణిక మంచి స్టోరీని ప్రొవైడ్‌ చేసింది. ఈ సినిమా గ్యారంటీగా సక్సెస్ అవుతుంది... అన్నారు.

  అనుష్క మాట్లాడుతూ..

  అనుష్క మాట్లాడుతూ..


  కణిక మంచి స్క్రిప్ట్ ను రూపొందించింది. ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతారు. అందుకే ఓ నటిగా ఈ స్క్రిప్ట్‌ విన్నప్పుడు కనెక్ట్ అయ్యాను. ఇందులో వెయిట్ లాస్ కు చెందిన కాన్సెప్టే కాదు ఈ సినిమాలో చాలా మంచి మెసేజ్‌ ఉంది అన్నారు.

  కీరవాణి మాట్లాడుతూ...

  కీరవాణి మాట్లాడుతూ...

  ఇలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ సిద్ధం చేసిన కణికను ముందుగా అభినందిస్తున్నాను. రాఘవేంద్రరావుగారితో పనిచేశాను. ఆయన అబ్బాయితో పనిచేస్తానని అప్పుడు ఉహిచంలేదు. తను మంచి క్రమశిక్షణ ఉన్న వ్యక్తి. నిర్మాత పివిపిగారు, అనుష్కలే ఈ సినిమా రూపొందడానికి కారణం. ఇలాంటి కథను నమ్మి చేసిన పివిపిగారిని, సినిమాలో బాగా కష్టపడి యాక్ట్ చేసిన అనుష్కను అభినందిస్తున్నాను. యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌.. అన్నారు.

  దర్శకుడు ప్రకాష్‌ కోవెలమూడి మాట్లాడుతూ...

  దర్శకుడు ప్రకాష్‌ కోవెలమూడి మాట్లాడుతూ...


  కీరవాణిగారు ఈ సినిమాలో పార్ట్‌ అయినందుకు హ్యపీగా ఉంది. ఈ ఏడాది ఆయనిచ్చిన బెస్ట్‌ సాంగ్స్‌ లో ఇదొకటి. అనంత్ శ్రీరామ్, శ్రీమణి మంచి సాహిత్యాన్ని అందించారు. కిరణ్‌ మంచి డైలాగ్స్‌ అందించారు అన్నారు.

  అంతా కష్టపడ్డారు

  అంతా కష్టపడ్డారు


  నిరవ్‌షా సినిమాను బ్యూటీఫుల్‌గా చూపించారు. ఆర్య, భరత్‌, ప్రకాష్‌రాజ్‌, సోనాల్‌, ఊర్వశిగారు ఇలా అందరూ సినిమా కోసం బాగా కష్టపడ్డారు. ఈ కథను వినగానే ముందు అనుష్క చేస్తుందా లేదా అని ఆలోచించాం. కానీ కథ వినగానే ఒప్పుకోవడమే కాదు, కథ డిమాండ్ మేర వెయిట్‌ పెరిగింది. డేడికేషన్ తో సినిమా చేసింది. మంచి కథ ఇచ్చినందుకు కణికకు థాంక్స్ అన్నారు దర్శకుడు.

  హార్ట్ టచింగట్

  హార్ట్ టచింగట్


  స్టోరీ వినగానే హార్ట్‌ టచింగ్‌గా అనిపించి డైరెక్ట్ చేయడానికి రెడీ అయ్యాను. అయితే పివిపిగారు కథ వినగానే సినిమా ఎలా ఉండాలో తన విజన్ తో చూసి సినిమాను పెద్ద సినిమాగా చేయాలని నిర్ణయం తీసుకుని నిర్మించారు. ఆయన విజన్‌, సపోర్ట్ కు థాంక్స్‌ అన్నారు దర్శకుడు.

  ఆర్య మాట్లాడుతూ...

  ఆర్య మాట్లాడుతూ...


  ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చినందుకు థాంక్స్‌. ఈ చిత్రతం అనుష్క కెరీర్‌లో మరో బెస్ట్‌ మూవీగా నిలుస్తుంది. ఈ సినిమా కోసం అందరూ చాలా కష్టపడ్డారు. అందరికీ ఆల్‌ ది బెస్ట్‌... అన్నారు.

  తెర వెనక

  తెర వెనక


  అనుష్క, ఆర్య, ఊర్వశి, సోనాల్‌ చౌహాన్‌, ప్రకాష్‌ రాజ్‌, ఊర్వశి, గొల్లపూడి మారుతీరావు, అడవిశేష్‌, పోసాని కృష్ణమురళి, భరత్‌,బ్రహ్మానందం తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిరవ్‌షా, డైలాగ్స్‌: కిరణ్‌ కుమార్‌, సాహిత్యం: అనంత్‌ శ్రీరామ్‌, శ్రీమణి, యం.యం.కీరవాణి, ఆర్ట్‌: ఆనంద్‌ సాయి, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డ్యాన్స్‌: రాజుసుందరం,బృంద, ఫిరోజ్‌ఖాన్‌, కాస్ట్యూమ్స్‌: ప్రశాంత్‌, కథ, స్క్రీన్‌ప్లే: కణిక థిల్లాన్‌ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: సందీప్‌ గుణ్ణం, నిర్మాత: పరమ్‌ వి.పొట్లూరి, కవిన్ అన్నే, దర్శకత్వం: ప్రకాష్‌ కోవెలమూడి.

  English summary
  Photos of Director Rajamouli and actor Rana Daggubati attended anushka shetty Size Zero Audio Launch function which is held in hyderabad.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X