»   »  ‘సైజ్ జీరో’ లాస్ ఎంత? బంగారం కాంటెస్ట్ సంగతేంటి?

‘సైజ్ జీరో’ లాస్ ఎంత? బంగారం కాంటెస్ట్ సంగతేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి, రుద్రమదేవి లాంటి భారీ చారిత్రక చిత్రాల తర్వాత అనుష్క చేసిన చిత్రం సాధారణ చిత్రం ‘సైజ్ జీరో'. ఈ చిత్రంలో ఆమె గత సినిమాలకు భిన్నంగా బొద్దుగా, లావుగా కనిపించబోతోంది. ఇందుకోసం ఎంతో కష్టపడి బరువు పెరిగింది. ఈసినిమాకు రెమ్యూనరేషన్ తీసుకోకుండా దాదాపు రెండు మూడు కోట్లు పెట్టుబడి పెట్టింది అనుష్క.

ఈ సినిమా హిట్టయి ఉంటే నిర్మాతతో పాటు అనుష్కకు లాభాల పరంగా బాగా వర్కౌట్ అయ్యేది. కానీ బాక్సాఫీసు వద్ద సినిమా అంచనాలు తప్పింది. తనకు రావాల్సిన రెమ్యూనరేషన్ నిర్మాత పివిపితో కలిసి సినిమా నిర్మాణంలో పెట్టుబడి పెట్టిన అనుష్కకు ఒక్క పైసా కూడా దక్కలేదట.

ఈ సినిమాను నిర్మాత పీవిపి డైరెక్టుగా ఇండియాతో పాటు ఓవర్సీస్ లో కూడా ఆయనే డైరెక్టుగా రిలీజ్ చేసారు. దీంతో ఆయనకు ఓవరాల్ గా రూ. 15 కోట్లు లాస్ వచ్చినట్లు సమాచారం. అయినా పివిపి లాంటి నిర్మాతకు ఈ 15 కోట్ల నష్టం గడ్డిపరకతో సమానం. సినీ ఫైనాన్షియర్‌గా, వివిధ వ్యాపారాల పరంగా ఆయనకు వచ్చే రాబడి ఎక్కువే.

 Size Zero Loses Rs 15 Crore

ఆ సంగతి పక్కన పెడితే... ‘సైజ్ జీరో' సినిమా చూడండి, కేజీ బంగారం గెలవండి అంటూ సినిమా విడుదలకు ముందు నిర్మాతలు చేసిన ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ తో పాటు 11 డిజిట్స్ ఉండే ఓ కూపన్ ఇస్తాం. ఆకోడ్ ను పివిపి సినిమా.కామ్ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. లేదా ఆ కూపన్ లో ఇచ్చిన 95454 66666 అనే మొబైల్ నంబర్ కు 11 అంకెల కోడ్ ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. ఇలా పంపిన ఆడియన్స్ నుండి 20 మందిని సెలక్ట్ చేస్తాం. వారితో అనుష్క స్పెషల్ చాటింగ్ ఉంటుంది. అలాగే ఆ 20 మందిలో ఒక లక్కీ విన్నర్ కు 1 కేజీ బంగారం బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది' అని ప్రచారం చేసారు.

సినిమా ఫలితాలను బట్టి... ఇలాంటి కాంటెస్టులకు ఆశపడి ప్రేక్షకులు థియేటర్లకు రారని తేలి పోయింది. మరి సినిమా ప్లాప్ అయింది, నిర్మాతకు కూడా నష్టాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అసలు బంగారం కాంటెస్టు నిర్వహిస్తారా? లేదా? అనేది చర్చనీయాంశం అయింది.

English summary
Size Zero film is yet to sell satellite rights and PVP directly released the movie in the country and also the overseas. So, the PVP naturally suffered huge losses. Industry estimates say that the loss could be of the order of 15 crore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu