»   » అనుష్క ‘సైజ్ జీరో’ చూడండి, 1 కేజీ బంగారం గెలవండి!

అనుష్క ‘సైజ్ జీరో’ చూడండి, 1 కేజీ బంగారం గెలవండి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అనుష్క,ఆర్య ప్రధాన పాత్రలో తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సైజ్ జీరో'. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. కామోడీ ఎంటర్టెనర్ గా సందేశాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ‘యు/ఎ' సర్టిపికెట్ జారీ చేసింది.

సినిమా ప్రమోషన్లో భాగంగా నిర్మాతలు 1 కేజీ బంగారం కాంటెస్టు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియజేసేందుకు సోమవారం ప్రసాద్ లాబ్స్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా నిర్మాత పరమ్ వి.పొట్లూరి మాట్లాడుతూ సినిమాను నిర్మించడమే కాదు దాని ప్రమోసన్స్ కూడా అంతే ముఖ్యమని తెలిపారు. ప్రమోషన్స్ లో భాగంగా కార్వీ వారి సహకారంతో ‘1 కేజీ బంగారం గెలవండి' కాంటెస్టు నిర్వహిస్తున్నామని తెలిపారు.

సినిమా టికెట్ తో పాటు 11 డిజిట్స్ ఉండే ఓ కూపన్ ఇస్తాం. ఆకోడ్ ను పివిపి సినిమా.కామ్ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. లేదా ఆ కూపన్ లో ఇచ్చిన 95454 66666 అనే మొబైల్ నంబర్ కు 11 అంకెల కోడ్ ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. ఇలా పంపిన ఆడియన్స్ నుండి 20 మందిని సెలక్ట్ చేస్తాం. వారితో అనుష్క స్పెషల్ చాటింగ్ ఉంటుంది. అలాగే ఆ 20 మందిలో ఒక లక్కీ విన్నర్ కు 1 కేజీ బంగారం బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది అన్నారు.

కారణం అదే

కారణం అదే


ఈ కాంటెస్టు పెట్టడానికి ప్రధాన కారణం పైరసీ చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నామని నిర్మాత తెలిపారు.

ఇకపై ప్రతి సినిమాకు

ఇకపై ప్రతి సినిమాకు


సైజ్ జీరో చిత్రానికి మాత్రమే కాదు ఇకపై మా బేనర్లో వచ్చే ప్రతి సినిమాకు ఈ కాంటెస్టు రన్ చేసే ప్లాన్లో ఉన్నామని నిర్మాత తెలిపారు.

అనుష్క

అనుష్క


అనుష్క మాట్లాడుతూ పైరసీ నిర్మూలించే దిశగా నిర్మాత ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయం అన్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టెనర్ ను ఆడియన్స్ వారి ఫ్యామిలీస్ తో కలిసి చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

నటీనటులు

నటీనటులు


అనుష్క, ఆర్య, భరత్, ఊర్వశి, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్ తదితరలు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్


ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిరవ్ షా, ఆర్ట్: ఆనంద్ సాయి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కాస్ట్యూమ్స్: ప్రశాంత్, కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి,దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి.

English summary
Producer PVP announces 1 kg gold content for audiences of Size Zero.
Please Wait while comments are loading...