»   » అనుష్క 'సైజ్‌ జీరో' కొత్త పోస్టర్‌ విడుదల

అనుష్క 'సైజ్‌ జీరో' కొత్త పోస్టర్‌ విడుదల

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హీరోయిన్ అనుష్క త్వరలోనే వైవిధ్యమైన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘సైజ్ జీరో'తో మన ముందుకు రానున్న సంగతి తెలిసిందే. చిత్రం కొత్త పోస్టర్‌ విడుదలైంది. ఈ చిత్రానికి ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మాత. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. అనుష్క, ఆర్యలతోపాటు సోనల్‌ చౌహాన్‌, వూర్వశి తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబరులో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ కొత్త పోస్టర్ ని మీరు ఇక్కడ దాన్ని చూడండి.


తెలుగు, తమిళంలో ద్వి భాషా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ నేపధ్యంలో చిత్రానికి సంభందించిన పోస్టర్స్ ని విడుదల చేస్తున్నారు. అలాగే నిన్నటి రోజూ ఓ పోస్టర్ వదిలారు.


Here's the fourth poster of Size Zero Movie & Inji Iduppazhagi


Posted by PVP Cinema on 23 August 2015

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో'. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు . డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం వెయిట్ లాస్ కి సంబంధించిన కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం అనుష్క దాదాపు ఇరవై కేజీల బరువు పెరిగింది. అలాగే హీరో ఆర్య ఇచ్చిన టిప్స్ సహాయంతో మళ్లీ బరువు తగ్గి నార్మల్ అయింది.


 Size Zero movie new poster released

ఇక హీరో ఆర్య ఇటీవల స్వీడన్ మీదుగా కఠినతరమైన సైకిల్ రైడ్ ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. సైజ్ జీరో నిర్మాతలు ఈ చిత్రంలో అలాంటి కష్టతరమైన సైక్లింగ్ విన్యాసాలను ఇందులో చూపిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యయం.కీరవాణి ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.


అనుష్క, ఆర్య, భరత్, ఊర్వశి ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిర్వాషా, ఆర్ట్: ఆనంద్ సాయి, కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి, దర్శకత్వం: ప్రకాష్ కోవెల మూడి.English summary
Anushka's ‘Size Zero’ is progressing at brisk pace under the direction of Prakash Kovelamudi. According to the latest film makers released new poster of the film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu