»   » అనుష్క ‘సైజ్ జీరో’రిలీజ్ డేట్ ఖరారైంది

అనుష్క ‘సైజ్ జీరో’రిలీజ్ డేట్ ఖరారైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో'. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు . ‘బాహుబలి' వంటి విజువల్ వండర్ లో దేవసేన పాత్రలో అలరించిన స్టార్ హీరోయిన్ అనుష్క త్వరలోనే డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘సైజ్ జీరో'తో మన ముందుకు రానుంది.

తాజగా అందుతున్న సమాచారం ప్రకారం ‘సైజ్' జీరో చిత్రాన్నిసెన్సార్ కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 21వ తేదీని బ్లాక్ చేసినట్లు సమాచారం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్ 2న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


ఇందులో అనుష్క గత సినిమాల కంటే భిన్నంగా లావుగా కనిపించబోతోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేసారు. ఇందులో అనుష్కను చూసిన అభిమానులు ఆమె భారీ కాయంతో ఉండటాన్ని చూసి షాకయ్యారు. తమ కలల దేవతనను తెరపై ఇలా చూస్తామని వారు బహుషా ఊహించి ఉండరు. అయితే తాజాగా విడుదలైన మూడో పోస్టర్లో అనుష్క లుక్ సెక్సీగా, హాట్ గా ఉండటంతో అభిమానుల మనసు కుదట పడింది.


Size Zero Release date confirmed

డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం వెయిట్ లాస్ కి సంబంధించిన కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం అనుష్క దాదాపు ఇరవై కేజీల బరువు పెరిగింది. బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ‘సైజ్ జీరో' సినిమా ప్రారంభం నుండి ప్రేక్షకుల్లో, సినీ అభిమానుల్లో భారీ క్రేజ్ ను క్రియేట్ చేసింది.


ఈ చిత్ర కథాంశం ప్రకారం అనుష్క భారీ లుక్ తో కనపడనుంది. అలాగే ఆర్య స్టయిలిష్ లుక్స్ తో ఈ రొమాంటిక్ కామెడిలో దర్శనమిస్తున్నాడు. టెక్నిషియన్స్ పరంగా కూడా యూనిట్ భారీగానే కనపడుతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి, నిరవ్ షా వంటి సినిమాటోగ్రాఫర్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. అలాగే నిర్మాత పి.వి.పి కూడా ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా భారీ లెవల్లోవిడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Anushka, Arya starrer ‘Size Zero’ under the direction of Prakash Kovelamudi is getting ready for censor.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu