»   » ట్రెండ్ క్రియేట్ చేసిన అనుష్క ‘సైజ్ జీరో’

ట్రెండ్ క్రియేట్ చేసిన అనుష్క ‘సైజ్ జీరో’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ నిర్మించిన భారీ చిత్రం ‘సైజ్ జీరో'. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు . ‘బాహుబలి', ‘రుద్రమదేవి' వంటి విలక్షణమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన స్టార్ హీరోయిన్ అనుష్క మరో విలక్షణమైన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘సైజ్ జీరో'తో నవంబర్ 27న మన ముందుకు రానుంది.

‘ఇంజి ఇడుపళగి' అనే పేరుతో ఈ చిత్రం తమిళంలో కూడా నవంబర్ 27నే విడుదల కానుంది. ఈ చిత్రం వెయిట్ లాస్ కి సంబంధించిన కాన్సెప్ట్ తో తెరకెక్కింది. దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి విన్నూతమైన సబ్జెక్ట్ తో కమర్షియల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ‘సైజ్ జీరో' సినిమా ప్రారంభం నుండి ప్రేక్షకుల్లో, సినీ అభిమానుల్లో భారీ క్రేజ్ ను క్రియేట్ చేసింది.ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి అందించిన ఆడియో, ట్రైలర్ నవంబర్ 1న విడుదలయ్యాయి. ఆడియో, ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం యూ ట్యూబ్ లో 1 మిలియన్ వ్యూస్ ను సంపాదించుకుని ట్రెండ్ క్రియేట్ చేసింది. రేపు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న అనుష్కకు ఇది చాలా ఆనందాన్ని కలిగించే విషయం.


అనుష్క, ఆర్య, భరత్, ఊర్వశి, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్ తదితరలు ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిరవ్ షా, ఆర్ట్: ఆనంద్ సాయి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కాస్ట్యూమ్స్: ప్రశాంత్, కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి,దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి.

English summary
The recently released trailer of PVP Cinema’s “Size Zero” reaches over 1 million views on Youtube. “Size Zero”, PVP Cinema’s upcoming film, is directed by K. S. Prakash Rao and stars Anushka Shetty, Arya and Sonal Chauhan in the lead roles. A bilingual project, the film is also being released in Tamil as “Inji Iduppazhagi”.
Please Wait while comments are loading...