»   »  డబ్బు, పేరు, టెన్షన్ ఫ్రీ: అందుకే పవన్‌ను వదిలేసి మహేష్ బాబు వైపు...!

డబ్బు, పేరు, టెన్షన్ ఫ్రీ: అందుకే పవన్‌ను వదిలేసి మహేష్ బాబు వైపు...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి దర్శకుడు ఎస్.జె.సూర్య తప్పుకున్నాడు. ఇపుడు ఆయన స్థానంలో 'గొపాల గోపాల' ఫేం డాలీ దర్శకత్వం చేయబోతున్నాడు.

పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ తో సినిమా దర్శకత్వం అంటే ఏ దర్శకుడైనా దాదాపు వదులుకునే సాహసం చేయరు. అయితే ఎస్.జె.సూర్య మాత్రం ఈ సాహసం చేసారు. దర్శకుడిగా కొనసాగడం కంటే నటుడిగా ఎదిగేందుకే ఎస్.జె సూర్య మొగ్గు చూపారు. ఈ క్రమంలో ఆయన పవన్ కళ్యాణ్ సినిమాను మధ్యలో వదిలేసి వెళ్లిపోక తప్పలేదు.

ఎస్.జె.సూర్య ఈ మధ్య నటుడిగా కూడా పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన తమిళ చిత్రం 'ఇరైవి' ఇటీవల విడుదలైంది. ఈ సినిమాలో సూర్య పెర్ఫార్మెన్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో పాటు అవకాశాలు కూడా వెల్లువలా వచ్చి పడ్డాయి. తెలుగు, తమిళంలో ఆయనకు నటుడిగా భారీ ఆఫర్లు వచ్చాయి.

డబ్బుకు డబ్బు, టెన్షన్ ఫ్రీ లైఫ్...
సినిమా రంగంలో బాగా టెన్షన్ ఉండే జాబ్ అంటే దర్వకత్వమే. ఒక సినిమాకు సంబంధించిన అన్ని విభాగాలను మేనేజ్ చేసేది ఆయనే. సినిమా హిట్టయితే మరో అవకాశం దక్కుతుంది. ప్లాప్ అయితే అవకాశాలు రావు. అందుకే దర్శకుల కెరీర్ లైఫ్ టైం చాలా తక్కువ. నటుడిగా మంచి పేరొస్తే ఒంట్లో సత్తా ఉన్నంత వరకు నటుడిగా రాణించవచ్చు. పైగా టెన్షన్ లేని జీవితం. తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు చేస్తారు కాబట్టి డబ్బు కూడా బాగా సంపాదిస్తారు. అందుకే ఎస్.జె.సూర్య చేతిదాకా వచ్చిన అవకాశాల్ని వదులుకోవడం ఇష్టం లేక పవన్ కళ్యాణ్ సినిమాను వదులుకున్నాడు.

మహేష్ బాబు సినిమాలో

మహేష్ బాబు సినిమాలో


మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ద్విబాషా చిత్రంలో ఎస్.జె.సూర్యకు విలన్ రోల్ చేసే అవకాశం దక్కింది. ఇంత పెద్ద సినిమాలో విలన్ గా మంచి పేరొస్తే తన దశ తిరుగుతుందని భావించిన సూర్య... పవన్ కళ్యాణ్ సినిమా వదులుకోక తప్పలేదు.

పవన్ కళ్యాణ్ తో మాట్లాడారు

పవన్ కళ్యాణ్ తో మాట్లాడారు


దర్శకత్వంతో పాటు నటుడిగా కూడా రాణించాలని ప్రయత్నించిన ఎస్.జె.సూర్య ఇటీవల పవన్ కళ్యాణ్ ను కలిసి తనకు అనుగుణంగా షూటింగ్ డేట్స్ అడ్జెస్ట్ చేయాలని ఒక ప్రతిపాదన తెచ్చాడట. అయితే దాని వల్ల షూటింగ్ బాగా లేటవ్వడం, బడ్జెట్ పెరగడం లాంటి ఇబ్బందులు ఉండటంతో కుదరలేదని టాక్.

పరస్పర అంగీకరారం

పరస్పర అంగీకరారం


దీంతో ఎస్.జె సూర్య దర్శకత్వం నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. పవన్ కళ్యాణ్, ఎస్.జె.సూర్య పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

డాలీ రంగంలోకి...

డాలీ రంగంలోకి...


ఎస్.జె.సూర్య తప్పుకోవడంతో నిర్మాత శరత్ మరార్ తో చర్చించిన పవన్ కళ్యాణ్....డాలీని దర్శకుడిగా తీసుకోవాలని నిర్ణయించారు. గతంలో డాలీ పవన్ కళ్యాణ్ నటించిన 'గోపాల గోపాల' సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా నిర్మాతల్లో శరత్ మరార్ కూడా ఒకరు. అందరికీ ఓకే కావడంతో డాలీ ఈ చిత్రానికి దర్శకుడిగా ఎంపికయ్యాడు.

English summary
Director S J Suryah has been replaced with director Dolly, for Pawan Kalyan's next, which is to be produced by Sharath Marrar under North star Entertainments. If you can recall, Pawan earlier promised Dolly, to work with him for a film, as he was mightily impressed with the director's work during Gopala Gopala.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu