Just In
- 34 min ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 1 hr ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
- 1 hr ago
మీకు అలాంటి పరిస్థితి రావొద్దు.. వాటిని పూసగుచ్చినట్టు వివరించిన రకుల్
- 2 hrs ago
అది ముగిసింది ఇది దొరికింది.. చమ్మక్ చంద్ర లక్ ‘అదిరింది’
Don't Miss!
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- News
జై హింద్, జై బంగ్లా: జై శ్రీరాం నినాదాలపై దీదీ గరం గరం, మోడీ సమక్షంలోనే ఫైర్..
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇలాంటి వార్తలు అల్లు అర్జున్ ఇమేజ్ డ్యామేజ్ చేయలేవు.. మెగా టీం స్వీట్ వార్నింగ్
సోషల్ మీడియా బాగా విస్తరించడం, మీడియా చానెళ్లు పుట్టలు పుట్టలుగా పుట్టుకురావడం కారణంగా గాసిప్స్‌కి హద్దే లేకుండా పోతోంది. నిజానిజాల సంగతి దేవుడెరుగు.. రకరకాల కోణాల్లో గాసిప్స్ పుట్టించేస్తున్నారు గాసిప్ రాయుళ్లు. ఇటీవలి కాలంలో ఇలాంటి కొన్ని గాసిప్స్ సెలెబ్రిటీలను ఇరకాటంలో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే వీటిపై ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ తమపై వస్తున్న పుకార్లను ఖండిస్తూ వస్తున్నారు సదరు సెలెబ్రిటీలు. ఈ కోవలోనే గత కొన్ని రోజులుగా మెగా కాంపౌండ్ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై వస్తున్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా వీటిపై స్పందిస్తూ ట్వీట్ చేశాడు పీఆర్, నిర్మాత ఎస్‌కెఎన్.

'నా పేరు సూర్య' సినిమా తరువాత చాలా రోజుల గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే షూటింగ్ సమయంలో సహాయ దర్శకుడిపై చేయి చేసుకున్నాడని, బన్నీ డిమాండ్ల కారణంగా ప్రొడ్యూసర్లు ఇబ్బందులు పడుతున్నారని రకరకాలుగా వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా వీటిపై స్పందించిన బన్నీ పీఆర్ ఎస్‌కెఎన్.. ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ద్వారా స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
Dear invisible enemy
— SKN (@SKNonline) July 27, 2019
Few Negative articles can't bring down 18 years hard work of a down to earth star. His dedication & helping nature always connect him with his followers
Let's see who ll have last smile
Super fantastic #AA19 getting ready& 20,21's pre production work in swing
"ప్రియమైన అదృశ్య శత్రువా.. 18 సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి సంపాదించుకున్న స్టార్ ఇమేజ్‌ని ఇలాంటి కొన్ని వ్యతిరేక వార్తలు డ్యామేజ్ చేయలేవు. అతని అంకిత భావం, సాయం చేసే తత్వం అభిమానులకు మరింత దగ్గరయ్యేలా చేస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తన 19వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మరోవైపు ఆయన 20, 21వ సినిమాల ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి" అని ఎస్‌కెఎన్ పేర్కొన్నాడు.