»   » సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నలో బడ్జెట్ హిందీ సినిమా

సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నలో బడ్జెట్ హిందీ సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్ధికమాంధ్యం దాంతో జనం ఎదుర్కొన్న ఇబ్బందులు నేపధ్యంలో రూపొందిన హిందీ కామిడీ చిత్రం "ఫాస్ గయారే ఒబామా" ఈ శుక్రవారం విడుదలైంది. విడుదలకుముందే ఆసక్తి రేపిన ఈ చిత్రం మొదటి మల్టిఫ్లెక్స్ సినిమానే అనుకున్నా అంతటా మంచి వసూళ్ళను సాధిస్తూ ఆశ్చర్యపరుస్తోంది.వీకెండ్ దాటిన తరువాత వచ్చే సోమవారం కూడా ఈ చిత్రం కలెక్షన్స్ నిలకడగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని చిన్న కాన్సెప్టు..పెద్ద విజయంగా అభివర్ణిస్తున్నారు. ఇక ఈ చిత్రం కథ మొత్తం ఓం శాస్త్రి అనే ఎన్నారై దృక్కోణంలో జరుగుతుంది.అతన్నే ఓ మామ అని పిలుస్తూంటారు..అదే ఒబామాగా వినపడుతూంటుంది. ఇక అమెరికాలో వ్యాపారం చేసుకుంటూ లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్న ఓం శాస్త్రికి ఆర్ధిక మాంధ్యం మూలంగా రాత్రికి రాత్రే రోడ్డుపై పడాల్సిన పరిస్ధితి వస్తుంది. బ్యాంక్ వాళ్ళు వచ్చి లోన్ కట్టకపోతే ఇళ్ళు ఖాళీ చేయమంటారు ..అర్జెంటుగా లక్ష డాలర్లు(దాదాపు యాభై లక్షలు)అప్పు తీర్చాల్సిన స్ధితి వస్తుంది. గట్టిగా బ్రతిమిలాడితే ముప్పై రోజులు టైమ్ ఇస్తారు.

వేరే దారిలేని ఓమ్ కి ఇండియాలో తన తాతలనాటి ఆస్ధి గుర్తుకు వస్తుంది. దాన్ని అమ్మి అప్పు తీర్చి ఒడ్డునపడదామని ఇండియాలో పడతాడు. అయితే ఇండియాలోనూ అదే ఆర్ధిక మాంధ్యం ఉంటుంది. దాంతో ఆర్ధికంగా చితికిపోయిన ఓ అండర్ వరల్డ్ గ్యాంగ్ కన్ను ఈ ఎన్నారై పై పడుతుంది. ఓమ్ ని కోటీశ్వరుడుగా భావించిన వారు అతన్నికిడ్నాప్ చేసి తమ భాధలు తీర్చుకోవాలనుకుంటారు. కిడ్నాప్ చేసిన తర్వాత ఈ దివాళా తీసిన ఎన్నారై దగ్గర తిరిగి అమెరికా వెళ్ళటానికి టిక్కెట్టు డబ్బు కూడా లేదని తెలుసుకుని ఏం చేయాలో అర్దం కాని స్దితిలో పడతారు. ఆ సిట్యువేషన్ లో ఓం శాస్త్రి ఏం చేసారు. అతని ఆర్ధిక సమస్యలను ఈ ఫెయిల్యూర్ గ్యాంగస్టర్స్ ని అడ్డం పెట్టుకుని ఎట్లా తీర్చుకున్నాడనే పాయింట్ తో ఈ చిత్రం పూర్తి కామిడీతో నడుస్తుంది. అదే జనాలకి పిచ్చ పిచ్చగా నచ్చుతోంది. ఈ బ్లాక్ కామిడీ లోని వ్యంగ్యం సినిమాకి హైలెట్ అంటున్నారు. ఈ చిత్రంలో రజిత్ కపూర్..ఓమ్ శాస్త్రిగానూ, నేహా ధూపియా..మున్ని అనే గ్యాంగస్టర్ గానూ కనపించినవ్విస్తంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu