చిన్న సినిమా మామూలుగా ట్రెండ్ అవ్వడంలేదుగా... అమెజాన్ లో రామ్ అసుర్ హంగామా

ఓటీటీల పుణ్యమాని కంటెంట్ ఉన్న సినిమాలకు గిరాకీ బాగా పెరిగింది. కాన్సెప్ట్ కాస్త ఇంట్రెస్టింగ్ అనిపిస్తే చాలు జనాలు బ్రహ్మరథం పట్టేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి హడావిడి సోసోగా ముగిసినా ఓటీటీలు మాత్రం కొత్త చిత్రాలతో కళకళలాడిపోతున్నాయి. ఇక సంక్రాంతి బరిలోనే ఓటీటీలోకి దూసుకువచ్చిన రామ్ అసుర్ మంచి మార్కులు వేయించుకుంటూ టాప్ పొజిషన్ లోకి దూసుకువచ్చేసింది.

అభినవ్ సర్దార్, రామ్ కార్తీక్, చాందినీ, షానీ సాల్మన్ ప్రధాన పాత్రల్లో నటించిన రామ్ అసుర్ సినిమా ప్రస్తుతం అమేజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. పెద్ద పండగను పరుస్కరించుకుని రిలీజ్ అయిన సినిమాలన్నీ పక్కకు పోగా, 'పుష్ప'తో పోటీపడుతూ ఏకంగా సెకండ్ ప్లేస్ వచ్చేసింది "రామ్ అసుర్". తెలుగు మూవీస్ క్యాటగిరీలోనూ, యాక్షన్ అడ్వెంచర్ క్యాటగిరీలోనూ రెండవ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో "పుష్ప" ఉండటం విశేషం.

Small movie trends on Amazon… RamAsur competing with Pushpa

కృత్రిమ వజ్రం తయారు చేయడం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన 'రామ్ అసుర్' ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్ కావడంతో జనాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆర్టిఫీషియల్ డైమండ్ ను రూపొందించాలనుకున్న ఇద్దరి సైంటిస్టుల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే ఈ సినిమా కథాంశం. ఇక ఈ కాన్సెప్ట్ కి తోడు ప్యారలెల్ గా సాగే పీరియాడికల్ లవ్ స్టోరీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. అభినవ్ సర్దాల్, చాందినీల లవ్ ట్రాక్ సినిమాకే హైలైట్ గా నిలవగా, బీమ్స్ అందించిన పాటలు మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి.

వెంకటేశ్ త్రిపర్ణ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. అభినవ్ సర్దార్ స్వీయ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం 'రామ్ అసుర్' ట్రెండింగ్ లోకి రావడంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ విజయం అందించిన స్ఫూర్తితో సమీప భవిష్యత్తులో మరిన్ని మంచి కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చిత్ర నిర్మాత అభినవ్ సర్దార్ వెల్లడించారు. మరి పష్పతో పోటీపడుతున్న 'రామ్ అసుర్' ఈ ఊపులో టాప్ ప్లేస్ కూ చేరుకుంటుందేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X