»   »  పోస్టర్ పై సిగెరెట్ తో సూపర్ స్టార్..కోర్టు నోటీసులు

పోస్టర్ పై సిగెరెట్ తో సూపర్ స్టార్..కోర్టు నోటీసులు

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  తిరువనంతపురం: తన తాజా చిత్రం కర్మయోధ ప్రచారంలో భాగంగా పొగ తాగుతూ గోడపత్రికపై కనిపించిన మలయాళీ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌పై కేరళ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆరోగ్య శాఖ దాఖలు చేసిన కేసు మేరకు మార్చి 18న న్యాయస్థానంలో వ్యక్తిగతంగా హాజరుకావాలని మోహన్‌లాల్‌కు తిరువనంతపురం ఫస్ట్‌ క్లాస్‌ జ్యూడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ సమన్లు జారీ చేశారు.

  కర్మయోధ చిత్ర దర్శకుడు మేజర్‌ రవి, ప్రొడక్షన్‌ మేనేజర్‌, మూడు థియేటర్ల మేనేజర్లకు కూడా సమన్లు పంపారు. అలాగే 'మ్యాట్నీ' సినిమా ప్రచార దృశ్యాల్లో నటి మైథిలి కూడా పొగ తాగుతూ కనిపించడంతో ఆమె కూడా మార్చి 18న హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఇక మరో ప్రక్క మోహన్ లాల్ నటించి మళయాళ డబ్బింగ్ తెలుగులో విడుదలకు సిద్దమవుతోంది.

  పదమూడేళ్ల క్రితం జరిగిన కాందహార్ హైజాక్ సంఘటనని ప్రేరణగా రూపుదిద్దుకున్న మలయాళ చిత్రం 'కాందహార్' ని అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు సి.హెచ్.వి.ఎస్.ఎన్. బాబ్జీ, డి.చక్రధర్. అమితాబ్ బచ్చన్, మోహన్ లాల్ నటించిన ఈ చిత్రానికి ఫైనాన్సియర్ ఎస్.రత్నమయ్య సమర్పకుడు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ 'ఈ సినిమాలో లోక్‌నాథ్ శర్మ అనే టీచర్‌గా అమితాబ్ కీలకమైన పాత్ర పోషించారు. అలాగే మేజర్ మహాదేవన్‌గా మోహన్‌లాల్ మరో ముఖ్య పాత్ర ధరించారు. 'ఢమరుకం'లో విలన్‌గా నటించిన గణేశ్ వెంకట్రామన్ ఇందులో ఆర్మీ కమాండర్‌గా నటించారు. వృత్తిరీత్యా ఆర్మీ ఆఫీసర్ అయిన మేజర్ రవి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా చిత్రానికి తనే దర్శకత్వం వహించారు.

  కథకు కీలకమైన సన్నివేశాలను డెహ్రాడూన్‌లోని మిలటరీ ఆకాడెమీలో, ఆఫ్ఘనిస్తాన్‌లో తీశారు. మలయాళంలో విడుదలైన ఈ చిత్రం విజయవంతమైంది. తెలుగు అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల్లోనే ఆడియోను, సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తాం' అని తెలిపారు. సుమలత, అనన్య, రాగిణి ద్వివేది, కావేరి ఝా, లలిత తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు, పాటలు: భారతీబాబు, సంగీతం: సమీర్ థాండన్, ఛాయాగ్రహణం: రవివర్మన్, ఎడిటింగ్: ముత్యాల నాని.

  English summary
  Thiruvananthapuram After actress Mythili, against whom the Health Department filed a case for appearing on a film poster smoking a cigarette, Malayalam superstar Mohanlal has also landed in trouble in a similar case. A summon has been issued to Mohanlal by the Judicial First Class Magistrate here to appear in person on March 18 after the Health Department filed a case against him for appearing in a poster holding a cigar in the advertisement for his latest film 'Karma Yodha'.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more