»   » సూపర్‌గా ఉంది, ఇండియాలో ఫస్ట్ టైం: ‘జగ్గా జాసూస్’ స్నీక్ పీక్ (వీడియో )

సూపర్‌గా ఉంది, ఇండియాలో ఫస్ట్ టైం: ‘జగ్గా జాసూస్’ స్నీక్ పీక్ (వీడియో )

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్నీక్ పీక్.... అనే పదం వినడానికే కొత్తగా ఉంది కదూ. ఇప్పటి వరకు సినిమాల రిలీజ్ ముందు టీజర్, ట్రైలర్ చూసాం. ఇపుడు బాలీవుడ్లో స్నీక్ పీక్ అంటూ ఓ కొత్త కాన్సెప్టును పరిచయం చేసారు. అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ 'జగ్గా జాసూస్' చిత్రానికి గాను ఈ సరికొత్త ప్రమోషనల్ వీడియో రిలీజైంది.

రణబీబ్ కపూర్, కత్రినా కైఫ్ జంటగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా తొలిసారిగా ఈ వీడియోను రిలీజ్ చేసారు. స్నీక్ పీక్ ఇన్ టు ది వరల్డ్ ఆఫ్ జగ్గా జాసూస్... అంటూ ప్రేక్షకులను ఇప్పటి వరకు ఇండియాన్ సినీమాల్లో చూడని ఓ కొత్త విజువల్ ప్రపంచంలోకి తీసుకెళ్లారు.

ఈ వీడియోలో డైలాగులు ఏమీ లేకుండా మ్యూజిక్ తోనే రన్ చేస్తూ... కామెడీ, అడ్వంచర్, లవ్ ఇలా చాలా చూపించారు. చివర్లో హీరో హీరోయిన్ పెదాలను ఆమెకు తెలియకుండా ముద్దు పెట్టుకునేందుకు ట్రై చేయడం....అదే సమయంలో హీరోయిన్ కళ్లు తెరవడం, అపుడు హీరో ఆమె పెదాలను చేతితో టచ్ చేసి తన పెదాలకు రాసుకుని.. 'నా పెదాలు ఎండిపోయాయ్' అంటూ కవర్ చేసుకునే సీన్ చాలా రొమాంటిక్ గా ఉంది.

Jagga Jasoos

సినిమా వివరాల్లోకి వెళితే ఇదో మ్యూజికల్ అడ్వంచర్ రొమాంటిక్ ఫిల్మ్. హీరో రణబీర్ కపూర్, దర్శకుడు అనురాగ్ బసు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం అయ్యారు. యూటీవీ మోషన్ పిక్చర్స్ అధినేత సిద్ధార్థరాయ్ కపూర్ తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఒక యంగ్ డిటెక్టివ్ మిస్సయిన తన తండ్రి వెతుక్కుంటూ వెళ్లి ఎలాంటి సాహసాలు చేసాడు అనే కాన్సెప్టుతో ఈ సినిమా సాగుతుంది.

English summary
A young detective sets out to look for his missing father on a journey that takes him on a life-changing adventure. Get a glimpse into the #WorldOfJaggaJasoos. The film, Jagga Jasoos releases on the 7th of April 2017. A Musical Adventure that promises to be a summer treat for families!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu