»   » స్నేహా తో ఆ విషయంలో బీట్ చెయ్యలేను: అల్లు అర్జున్

స్నేహా తో ఆ విషయంలో బీట్ చెయ్యలేను: అల్లు అర్జున్

By Sindhu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో కొన్నాళ్లపాటు షూటింగ్‌లకు దూరంగా ఉన్న అల్లు అర్జున్ మళ్లీ బిజీ అవ్వబోతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన చేయబోయే సినిమా షూటింగ్ త్వరలోనే ఆరంభం కానుంది. ఇదిలావుంటే... ఈ సినిమా తర్వాత ఆయన మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఆర్ ఆర్ మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మించనున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రం చిత్రీకరణ మొదలు కానుందట.

  కాగా ఎనిమిది నెలల క్రితం అల్లు అర్జున్ వేరు... ఇప్పటి అర్జున్ వేరు. అప్పుడు అతని జీవితంలో సినిమా, డ్యాన్స్ మాత్రమే ఉండేవి. మాటల్లో అల్లరి తొణికిసలాడేది. ఆ సరదా ముచ్చట్లు ఇప్పుడూ ఉన్నా కాస్త పరణితి కనిపిస్తోంది. కారణం... పెళ్ళి. స్నేహతో కలిసి ఏడడుగులు నడిచిన తరవాత తన అభిరుచుల్లో, ఆలోచనల్లో మార్పులు మొదలయ్యాయి. కొత్త జీవితం ఎలా వుంది? ఈ విషయాలపై మనసులోని మాటల్ని ఓ ప్రముఖ దినపత్రికతో ఇలా పంచుకున్నారు అల్లు అర్జున్.

  బ్రహ్మచారిగా...'పెళ్లికి ముందు నా తీరు చాలా విభిన్నం. ఎక్కువ సమయం స్నేహితులతోనే గడిపేవాణ్ని. ఎక్కడికైనా వెళ్లాలన్నా అయిదారుగురు స్నేహితులతో కలిసి చక్కర్లు కొట్టేవాళ్లం అన్నారు. ఇప్పుడేమో...: "బ్రహ్మచారి జీవితానికీ పెళ్లైన తరవాత జీవితానికి చాలా మార్పు ఉంటుంది. పెళ్లి కాక ముందు ఫ్రెండ్స్‌ తో చేసిన సరదాలు ఒక తీరున ఉంటే ఇప్పుడు మరో రెండుమూడు జంటలతో కలిసి ఎక్కడికైనా వెళ్తున్నాం. ఇది మరో రకమైన ఎంజాయ్‌ మెంట్".

  పెళ్లి పుస్తకం...:"పెళ్లై అప్పుడే ఎనిమిది నెలలైంది. స్నేహ విషయంలో నేను చాలా లక్కీ నన్ను అర్దం చేసుకునే జీవిత భాగస్వామి దొరికింది. ఏ విషయంలోనూ తనతో ఇబ్బంది ఉండదు. తను చాలా శాంతంగా ఉంటుంది. నాదంతా అల్లరి టైపు. నన్ను చాలా బాగా అర్దం చేసుకుంటుంది". స్నేహ అందంగా ఉండటమే కాదు డాన్స్ కూడా చాలా అందంగా చేస్తుంది. తెర మీద అల్లు అర్జున్ మంచి డ్యాన్సర్ అని తెలుసు. నా శ్రీమతి స్నేహ కూడా బాగా డ్యాన్స్ చేస్తుంది. ఈ మధ్య ఓ మెహందీ కార్యక్రమంలో చేసిన తన డ్యాన్స్ చూసి కొంతమంది ఆమెను అభినందించారు. అందుకే .. స్నేహతో డ్యాన్స్ విషయంలో పోటీపడను" అని చెప్పారు.

  English summary
  We all know that Allu Arjun is a very good dancer and probably the best in business. Is there a dancer whom he can't compete with? He says that his wife Sneha is a very good dancer and he can't beat her in dance. Allu Arjun told that Sneha's dance at their Sangeeth event was appreciated by many.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more