»   » సినిమాలు లేకేనా స్నేహ అలా చివరకు...

సినిమాలు లేకేనా స్నేహ అలా చివరకు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాపు బొమ్మ స్నేహకి ఎక్కడా సినిమాలు లేకుండా పోయాయి. దాంతో ఆమె ఇప్పుడు తల్లి పాత్రలకు రెడీ అయిపోయింది. తాజాగా ఆమె రేవతి వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'మేడ్‌ డాడ్‌'లో తల్లి పాత్ర చేస్తోంది.హిందీలో నిర్మామణవుతున్న ఈ చిత్రంలో ఆమె నసీరుద్దీన్‌ షా భార్యగా నటించేందుకు ఒప్పుకొంది.ఆ దంపతుల కుమార్తె పాత్రను ఆయేషా టకియా దక్కించుకొంది.అంటే సూపర్ భామ ఆయేషా తకియా తల్లిగా ఆమె చేస్తోందన్నమాట.ఇంత చిన్న వయస్సులో అప్పుడే తల్లి పాత్రలకు కమిటవటం చాలా దురదృష్టమంటున్నారు.ఇక ఈ విషయమై స్నేహ మాట్లాడుతూ.హిందీలో ఎప్పుడో నటించాల్సింది.కానీ కుదర్లేదు.'మేడ్‌ డాడ్‌'తో బాలీవుడ్‌లో అడుగుపెట్టే అవకాశం వచ్చింది.చాలా చక్కటి పాత్ర చేయబోతున్నాను.చాలా సంతోషంగా ఉంది అంది.దర్సకురాలు రేవతి మాట్లాడుతూ..ఈ చిత్రంలో స్నేహ పాత్ర కీలకమైనదే. ఎనభైల్లో మనం చూసిన తల్లి పాత్రను పోలి ఉంటుంది. ఇలాంటి సంప్రదాయ పాత్రల్లో నటించడం ఎలాగో స్నేహకు బాగా తెలుసు. తనైతేనే ఈ పాత్రకు సరైన న్యాయం చేయగలదు అనిపించింది. అందుకే ఆమెను ఎంచుకొన్నాను అంది.ఇక ప్రస్తుతం స్నేహ ..నాగార్జున సరసన రాజన్న చిత్రంలో చేస్తోంది. విజయేంద్ర ప్రసాద్ దర్సకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తెలంగాణా సాయుధ పోరాటం నేపధ్యంలో సాగుతుంది.

English summary
Sneha is traveling to Bollywood for her first ever Hindi film titled as ‘Mad Dad’ directed by Revathy S Varma. She will play Naseeruddin Shah’s wife character while Ayesha Takia will play her daughter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu