»   » క్యూట్ ఫోటో : అల్లు అర్జున్ తన కొడుకుతో కలిసి డాన్స్ సెసన్ లో....

క్యూట్ ఫోటో : అల్లు అర్జున్ తన కొడుకుతో కలిసి డాన్స్ సెసన్ లో....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్ తన కొడుకు...ఆర్యన్ ..ముద్దుచ్చే ఓ చిన్నారి సెలబ్రెటీ. ఈ చిన్నారి బాబు ఏం చేస్తున్నాడు అనేది ఎప్పుడూ అల్లు అభిమానులకు అవసరమే...వినటానికి ఆనందమే. అందుకే సోషల్ మీడియాలో వీరు అప్ డేట్స్ ని ఉంచుతూంటారు అల్లు అర్జున్ దంపతులు. అలాంటిదే ఈ క్రింద షేర్ చేసిన ఫోటో.

Father son time

Posted by Sneha Reddy on 13 July 2015

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తాజాగా పైన కనపడుతున్న ఈ ఫోటోని అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి..షేర్ చేసారు. బన్ని, ఆర్యన్... డాన్స్ స్టూడియోలో ఇదిగో ఇలా ఫన్ చేస్తూ గడుపుతున్నారు. అంటే అక్కడ అల్లు అర్జున్ నుంచి ఖచ్చితంగా ఆర్యన్ డాన్స్ స్టెప్స్ నేర్చుకున్నాడన్నమాటేగా.

అల్లు అర్జున్ లేటెస్ట్ చిత్రం విషయానికి వస్తే...

అల్లు అర్జున్ , బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో తాజాగా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరమ్మాయిలతొ సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ ఫైట్ ని కంపోజ్ చేసిన కెచ్చా ని ఈ సినిమాకోసం తీసుకున్నట్టు సమాచారం. కెచ్చా..ధాయిలాండ్ కు చెందిన ఫైట్ మాస్టర్.

అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక ఫైట్ షూటింగ్ తో ఈ నెల 19నుండి ప్రారంభించనున్నారు. ఈ సినిమా ఈ మధ్యనే లాంఛనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమాలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కనపడనుంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Sneha Reddy sahre ...Bunny & Ayaan dancing sessions

చిత్రం వివరాల్లోకి వెళితే..

తొలి నుంచి తనదైన శైలిలో మాస్‌ కథల్ని తెరకెక్కించడంలో ప్రత్యేకత చూపుతూ హిట్స్ కొట్టడం బోయపాటి శ్రీను శైలి ప్రత్యేకం. 'భద్ర', 'తులసి', 'సింహా' చిత్రాలతో హిట్ చిత్రాల దర్శకుడయ్యారు. గతేడాది 'లెజెండ్‌'తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకొన్నారాయన. దాంతో అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు కథను సిద్ధం చేసుకొన్నారు.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘‘అల్లు అర్జున్‌, బోయపాటి శీను కాంబినేషన్‌లో సినిమా చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. బోయపాటి శ్రీను చెప్పిన కథ నాకు, బన్నికి బాగా నచ్చి మా గీతా ఆర్ట్స్‌లోనే చేస్తున్నాం. పూర్తిస్థాయి హీరోయిజం ఉంటూ ప్యూర్‌ లవ్‌ స్టోరీ మిక్స్‌ అయిన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తాం.

బన్నిని అభిమానులు, సినిమా ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో పక్కాగా అలాంటి పాత్రతో బోయపాటి శీను కథ చెప్పారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. ఆ వివరాలను త్వరలో చెప్తాం. బన్ని కాంబినేషన్‌లో థమన్‌ చేస్తున్న రెండో సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమా అవుతుంది'' అని తెలిపారు.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘బన్ని బాడీ లాంగ్వేజ్‌కి సరిపోయే కథను సిద్ధం చేశాను. అరవింద్‌గారు, బన్ని ఈ కథ విని వెంటనే ఓకే చేశారు. పక్కా అవుట్‌ అండ్‌ అవుట్‌ హీరోయిజం ఉన్న స్టోరీ ఇది. లవ్‌ స్టోరీ కూడా మిళితమై ఉంటుంది. కొత్త బన్ని కనిపిస్తారు. ఈ సినిమా తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తాను'' అని తెలిపారు.

అల్లు అర్జున్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ సంస్థలో ఓ సినిమా రూపొందనుంది.థమన్‌.ఎస్‌.ఎస్‌. ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: థమన్‌.ఎస్‌.ఎస్‌., మాటలు: ఎం.రత్నం, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బోయపాటి శీను.

English summary
Above is the pic recently shared by Bunny wife Sneha Reddy. Bunny and Ayaan is having fun moments in what seemed like a dance studio.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu