ప్రకాష్ రాజ్ సరసన స్నేహ నే ఫైనల్...

By Srikanya

హైదరాబాద్ : వివాహం చేసుకుని చిత్ర పరిశ్రమకు గ్యాప్ ఇచ్చిన స్నేహ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. ఆమె త్వరలో ప్రకాష్ రాజ్ సరసన కనిపించనుంది. ఈ చిత్రం పేరు 'ఉలవచారు బిర్యానీ'. తన స్వీయదర్శకత్వంలో ధోనీ చిత్రాన్ని తెరకెక్కించిన నటుడు ప్రకాష్ రాజ్ త్వరలో మరో సరికొత్త కాన్సెప్టుతో ప్రేక్షుల ముందుకు రాబోతున్నారు.

మలయాళంలో ఘన విజయం సాధించిన 'సాల్ట్ అండ్ పెప్పర్' చిత్రానికి ఇది రీమేక్. ఆ మధ్య కేరళ ఫిల్మ్ ఫెస్టివల్స్ కు వెళ్లిన ఆయన 'సాల్ట్ అండ్ పెప్పర్' చిత్రం చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. దాంతో వెంటన ఆ చిత్ర నిర్మాతను అప్రోచ్ కావటం రీమేక్ హక్కులను సొంతం చేసుకోవటం జరిగింది. మళయాలంలో ఈ చిత్రానికి ఆషిక్ అబు దర్శకుడు. ఇప్పుడు ఆ చిత్రాన్ని 'ఉలవచారు బిర్యానీ' పేరుతో తెలుగులో రూపొందించబోతున్నారు. ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించటంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రం గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ...'ఉలవచారు బిర్యానీ' నేను నా స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందించబోతున్నాను. మళయాలంలో హిట్టయిన 'సాల్ట్ అండ్ పెప్పర్' చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెలుతుంది' అని తెలిపారు. మళయాళంలో వచ్చిన 'సాల్ట్ అండ్ పెప్పర్'లో మోహన్ లాల్, శ్వేతా మీనన్, ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రల్లో కనిపించారు.

మరో ముఖ్యపాత్రలో యామీ గౌతం నటించనుంది. హీరోగా ప్రకాష్ రాజ్ కనిపించబోతున్న ఈ "ఉలవచారు బిర్యానీ" కి ' లవ్ ఈజ్ కుకింగ్ ' అన్న ట్యాగ్ లైన్ తగిలించారు. త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ చిత్రానికి సాహిత్యం సిరివెన్నెల అందించనుండగా సంగీత బాధ్యతలు ఇళయరాజా స్వీకరించారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X