తమన్న-సమంతలతో స్నేహా ఉల్లాల్ ఫైట్
జూనియర్ ఐశ్వర్యగా పేరుతెచ్చకున్న స్నేహా ఉల్లాల్ నటించిన తొలి సినిమా ఉల్లాసంగా-ఉత్సాహంగా సినిమా హిట్ కావడంతో ఆమెకు ఇకపై తిరుగు ఉండదని అంతా భావించారు. అయితే పరిస్థితి తిరగబడింది. అమ్మడు ఆశించినన్ని అవకాశాలు కాపోగా కెరీర్ లో చాలా వెనకబడిపోయింది. ఆ మధ్య విడుదలైన సింహా సినిమా హిట్టయినా....ఈ హీరోయిన్ కు ఒక్క మార్క కూడా పడలేదు. అన్ని మార్కులు బాలయ్యే తన్నకెళ్లాడు. దీంతో ఏం చేయాలో తోచక తిరుగుటపా కడుదామనే తరుణంలో అల్లరి నరేష్ 'మడత కాజా" సినిమాలో అవకాశం దక్కించుకుంది అమ్మడు. ఈ సినిమా దసరాకు విడుదల కాబోతోంది.
ఈ సారైనా మంచి హిట్టు దొరికితే రేసులో దూసుకుపోదామనుకున్న అమ్మడుకి సమంత, తమన్నా రూపంలో గట్టి పోటీ ఎదురవబోతోంది. మడత కాజాతో పాటు సమంత నటించిన దూకుడు, తమన్నా నటించిన ఊసరవెల్లి సినిమాలు కూడా విడుదలవ్వబోతున్నాయి. సో ఇద్దురు టాప్ హీరోయిన్లతో గట్టి ఫైట్ చేస్తే తప్ప జూనియర్ ఐశ్వర్యరాయ్ పుంజుకునే అవకాశం లేదు. మరి ఏం జరుగబోతోందో? చూడాలి.


Click it and Unblock the Notifications











